రుద్రంగి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలము. భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో ఉత్తరాన జగిత్యాల మరియు నిజామాబాదు జిల్లాల సరిహద్దులో ఉంది. మండలంలో 5 ఎంపీటీసి స్థానాలు, 10 గ్రామపంచాయతీలు, 2 రెవెన్యూ గ్రామాలు కలవు.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అంతకుక్రితం కరీంనగర్ జిల్లాలోని చందుర్తి మండలంలోని ఒక గ్రామం, నిజామాబాదు జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని ఒక గ్రామం కలిపి ఈ మండలాన్ని ఏర్పాతుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో ఉత్తరాన జగిత్యాల మరియు నిజామాబాదు జిల్లాల సరిహద్దులో ఉంది. ఈ మండలానికి దక్షిణాన మరియు ఈశాన్యాన చందుర్తి మండలం, తూర్పున జగిత్యాల జిల్లా, ఉత్తరాన మరియు పశ్చిమాన నిజామాబాదు జిల్లా సరిహద్దుగా ఉంది. రవాణా సౌకర్యాలు: మెట్‌పల్లి నుంచి వేములవాడ వెళ్ళు ప్రధాన రహదారి మండల కేంద్రం గుండా వెళ్ళుచున్నది.
రాజకీయాలు:
ఈ మండలము వేములవాడ & బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ & నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన స్వరూపరాణి, జడ్పీటీసిగా తెరాసకు చెందిన గట్ల మీనయ్య ఎన్నికైనారు.
రుద్రంగి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Manala, Rudrangi
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
రుద్రంగి (Rudrangi): రుద్రంగి కరీంనగర్ జిల్లా చందుర్తి మండలమునకు చెందిన గ్రామము. 2016 జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కరీంనగర్ జిల్లా చందుర్తి మండలంలో ఉన్న ఈ గ్రామం అక్టోబరు 11, 2016న కొత్తగా మండల కేంద్రంగా మారింది. ఈ గ్రామము వాలీబాల్ ఆటకు జిల్లాలోనే ప్రసిద్ధి చెందింది. చందుర్తి జడ్పీటీసిగా, చందుర్తి ఎంపిపిగా పనిచేసిన ఆది శ్రీనివాస్ ఈ గ్రామానికి చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Rudrangi Mandal, Rajanna Sirisilla Dist (district) Mandals in telugu, Rajanna Sirisilla Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి