సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలము. భౌగోళికంగా ఈ మండలం జిల్లా మధ్యలో ఉంది. మండలం దక్షిణ సరిహద్దు గుండా మానేరునది ప్రవహిస్తోంది. మండలంలో 5 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము. మండలం చేనేత కార్మికులకు ప్రసిద్ధి. రాష్ట్రంలో తొలి టెక్స్‌టైల్ పార్క్ మండల కేంద్రంలో ఏర్పాటైంది. ప్రముఖ బాలసాహితీవేత్త, 2019లో ఉగాది సాహితీ పురస్కార గ్రహీత కందేపి రాణిప్రసాద్, అగ్గిపెట్టెలో ఇమిడే చీరెను మగ్గంపై నేసిన నల్ల పరంధాములు ఈ మండలానికి చెందినవారు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో భాగమైంది. అదేసమయంలో సిరిసిల్ల మండలం నుంచి 16 రెవెన్యూ గ్రామాలను విడదీసి కొత్తగా తంగెళ్ళపల్లి మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లా మధ్యలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన కోనారావుపేట మండలం, ఈశాన్యాన వేములవాడ మండలం, దక్షిణాన తంగెళ్ళపల్లి మండలం, పశ్చిమాన ఎల్లారెడ్డిపేట మండలం సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణ సరిహద్దు గుండా మానేరునది ప్రవహిస్తోంది. రాజకీయాలు: ఈ మండలము సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 142784. ఇందులో పురుషులు 70724, మహిళలు 72060. అక్షరాస్యుల సంఖ్య 91372.
రవాణా సౌకర్యాలు: కామారెడ్డి నుంచి కరీంనగర్ వెళ్ళు ప్రధాన రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది.
సిరిసిల్ల మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bonala, Mushtipalli, Peddur, Sardapur, Sircilla
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
సిరిసిల్ల (Sirisilla): సిరిసిల్ల 2016లో కొత్తగా జిల్లా కేంద్రంగా మారింది. అంతకుక్రితం కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండేది. ఈ పట్టణంలో చేనేత కార్ముకులు అధిక సంఖ్యలో ఉన్నారు. తెలంగాణలో తొలి టెక్స్‌టైల్ పార్క్ సిరిసిల్లలో ఏర్పాటుచేయబడింది. అగ్గిపెట్టెలో ఇమిడే చీరెను మగ్గంపై నేసిన నల్ల పరంధాములు ఈ పట్టణానికి చెందినవారు. 1935లో ఇక్కడ కమ్యూనిస్టు 4వ మహాసభలు జరిగాయి. 2013లో సాహితీ సభలు నిర్వహించబడ్డాయి. ముష్టిపల్లి (Mushtipalli): ముష్టిపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలమునకు చెందిన గ్రామము. 2018లో ఈ గ్రామపంచాయతికి పారిశుద్ధ్య విభాగంలో ఉత్తమ పంచాయతీగా రాష్ట్రపతి అవార్డు లభించింది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Sirisilla Mandal, Rajanna Sirisilla Dist (district) Mandals in telugu, Rajanna Sirisilla Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి