వీర్నపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలము. భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో పశ్చిమం వైపున నిజామాబాదు మరియు కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉంది. మండలంలో 5 ఎంపీటీసి స్థానాలు, 17 గ్రామపంచాయతీలు, 23 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం జిల్లాలో పశ్చిమ భాగంగా నిజామాబాదు జిల్లా సరిహద్దులో ఉంది.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అంతకుక్రితం ఎల్లారెడ్డిపేట మండలంలో ఉన్న 6 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదేసమయంలో ఈ మండలం కరీంనగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో పశ్చిమం వైపున నిజామాబాదు మరియు కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఈశాన్యాన మరియు తూర్పున కోనారావుపేట మండలం, దక్షిణాన ఎల్లారెడ్డిపేట మండలం, ఉత్తరాన మరియు పశ్చిమాన నిజామాబాదు జిల్లా, వాయువ్యాన కామారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన మాలోతు బూల, జడ్పీటీసిగా తెరాసకు చెందిన గుగులోతు కళావతి ఎన్నికైనారు.
వీర్నపల్లి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Adavipadira, Garjanapalli, Kancherla, Maddimalla, Vanpalli, Veernapalli
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
గర్జనపల్లి (Garjanapalli): గర్జనపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి పేట మండలమునకు చెందిన గ్రామము. ఐఏఎస్ అధికారి చంద్రకళ ఈ గ్రామానికి చెందినవారు. వీర్నపల్లి (Veernapalli) : వీర్నపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. అక్టోబరు 11, 2016న ఈ గ్రామం కొత్తగా మండల కేంద్రంగా మారింది. అంతకు ముందు ఈ గ్రామం ఎల్లారెడ్డి పేట మండలంలో మరియు కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండెది. ఫిబ్రవరి 2020లో వీర్నపల్లిలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించబడ్డాయి
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Veernapalli Mandal in Telugu, Rajanna Sirisilla Dist (district) Mandals in telugu, Rajanna Sirisilla Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి