తంగెళ్ళపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలము. భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో దక్షిణం వైపున సిద్ధిపేట జిల్లా సరిహద్దులో ఉంది. మండలం ఉత్తర సరిహద్దు గుండా మానేరునది ప్రవహిస్తోంది. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 29 గ్రామపంచాయతీలు, 16 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం చేనేత కార్మికులకు ప్రసిద్ధి. సిరిసిల్ల నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జువ్వాడి నరసింగరావు ఈ మండలమునకు చెందినవారు.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అంతకుక్రితం సిరిసిల్ల మండలంలో ఉన్న 16 రెవెన్యూ గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదేసమయంలో ఈ మండలం కరీంనగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో దక్షిణం వైపున సిద్ధిపేట జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన సిరిసిల్ల మండలం, తూరున ఇల్లంతకుంట మండలం, పశ్చిమాన ముస్తాబాదు మండలం, ఈశాన్యాన బోయిన్‌పల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం ఉత్తర సరిహద్దు గుండా మానేరునది ప్రవహిస్తోంది. రాజకీయాలు: ఈ మండలము సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. సిరిసిల్ల నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జువ్వాడి నరసింగరావు ఈ మండలమునకు చెందినవారు. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన పగిడెల మానస, జడ్పీటీసిగా తెరాసకు చెందిన పి.మంజుల ఎన్నికైనారు.
తంగెళ్ళపల్లి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Baddenapalli, Baswapur, Cheerlavancha, Chintalthana, Gandilachapet, Jillella, Kasbekatkur, Mandepalli, Narsimhulapalli, Nerella, Obulapur (PK), Ramchandrapur, Sarampalli, Thadur, Thangallapalli, Venugopalpur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
తంగళ్లపల్లి (Tangallapalli): తంగళ్లపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. సిరిసిల్ల నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జువ్వాడి నరసింగరావు ఈ గ్రామమునకు చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tangellapalli Mandal, Rajanna Sirisilla Dist (district) Mandals in telugu, Rajanna Sirisilla Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి