వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలము. ప్రముఖమైన శ్రీరాజరాజేశ్వర దేవాలయం వేములవాడలో ఉంది. మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు, 11 గ్రామపంచాయతీలు, 8 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం గుండా మానేరు ఉపనది అయిన మూలవాగు ప్రవహిస్తోంది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో భాగమైంది. అదేసమయంలో సిరిసిల్ల మండలం నుంచి 15 రెవెన్యూ గ్రామాలను విడదీసి కొత్తగా వేములవాడ గ్రామీణ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున బోయిన్‌పల్లి మండలం, దక్షిణాన సిరిసిల్ల మండలం, పశ్చిమాన కోనారావుపేట మండలం, ఉత్తరాన మరియు వాయువ్యాన (దక్షిణాన కూడా కొంత) వేములవాడ గ్రామీణ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగము. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన బూర వజ్రమ్మ, జడ్పీటీసిగా తెరాసకు చెందిన మ్యాకల రవి ఎన్నికైనారు. రవాణా సౌకర్యాలు: వేములవాడ ప్రముఖ పుణ్యక్షేతం కావడంతో మండలకేంద్రానికి చక్కటి రవాణా వసతులున్నాయి. మెట్‌పల్లి, కరీంనగర్, కామారెడ్డిల నుంచి ప్రధాన రహదారులున్నాయి.
వేములవాడ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Chandragiri, Marupaka, Nampalli, Sankepalli, Satrajupalle, Thettakunta, Thippapuram, Vemulawada
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
సంకేపల్లి (Sankepalli): సంకేపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మండలమునకు చెందిన గ్రామము. 2019 ఎంపీటీసి ఎన్నికలలో సంకేపల్లి ఎంపీటీసి స్థానం నుంచి భాజపాకు చెందిన బుర్రా లాహారిక విజయం సాధించారు.
వేములవాడ (Vemulawada):
వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పట్టణము. పట్టణంలో ప్రముఖమైన కళ్యాణి చాళుక్యుల కాలం నాటి శ్రీరాజరాజేశ్వర దేవాలయం ఉంది. ఇది దక్షిణ బారతదేశంలోనే సుప్రసిద్ధ శైవక్షేత్రాలలో ఒకటి. లింగస్వరూపుడైన రాజరాజేశ్వర స్వామికి కోడె మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ప్రత్యేకత.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Vemulawada or Vemulavada Mandal in Telugu, Rajanna Sirisilla Dist (district) Mandals in telugu, Rajanna Sirisilla Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి