29, మే 2020, శుక్రవారం

భువనగిరి కోట (Bhuvanagiri Fort)

జిల్లాయాదాద్రి భునవగిరి
నిర్మాత6వ త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు
ప్రత్యేకతఏకశిలాపై నిర్మించిన దుర్గం
యాదాద్రి భునవగిరి జిల్లాలో హైదరాబాదు-వరంగల్ ప్రధాన రహదారికి సమీపంలో ఉన్న భువనగిరి కోట శతాబ్ది ఘనచరిత్రను కల్గియ్ంది. 148 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు 500 ఎడుగుల ఎత్తయిన ఏకశిలపై ఈ కోట పశ్చిమ చాళుక్య 6వ త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు నిర్మించినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ కొట కోడిగుడ్డు ఆకారంలో ఉండటం ఇక్కడి ప్రత్యేకత. కోటపై కన్నడ, తెలుగు భాషలలో పలు శాసనాలు లభించాయి

త్రిభువనమల్లుని పేరిట ఈ కోటకు మొదట త్రిభువనగిరిగా పిల్వబడి, నవాబుల కాలంలో భువనగిరిగా మార్చబడినట్లుగా చరిత్రకారుల రచనల వల్ల తెలుస్తోంది. భువనగిరి కోట పైభాగంలో రాజప్రసాదం, గుళ్ళు, సభామందిరం, కోనేరులు, నివాసగృహాలున్నాయి. కొండపై ఎక్కడానికి రెండువైపుల నుంచి ప్రవేశ ద్వారాలున్నాయి. కొండపై ఉన్న 7 కోనేరులు సప్తసరస్సులుగా ప్రసిద్ధి చెందాయి. ద్యావనపల్లి సత్యనారాయణ భువనైక సౌందర్యం పేరుతో గ్రంథం రచించారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ కోటలు,


 = = = = =
ఆధారాల గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలంగాణ మేగజైన్ (డిసెంబరు 2015),
  • సాంస్కృతిక వైభవం (రచన: ఆచార్య ఎస్వీ రామారావు),
  • బ్లాగు నిర్వాహకుని అనుభవం, పర్యటన అనుభవాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక