31, మే 2020, ఆదివారం

జర్మనీ (Germany)

ఖండంఐరోపా
వైశాల్యం3.57 లక్షల చకిమీ
జనాభా8.3 కోట్లు
కరెన్సీయూరో
ప్రస్తుత ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటైన జర్మనీ యూరప్ ఖండానికి చెందిన దేశము. 3.57 లక్షల చకిమీ వైశాల్యం, 8.3 కోట్ల జనాభాను కల్గియున్న ఈ దేశ రాజధాని మరియు పెద్ద నగరం బెర్లిన్. జర్మనీ అధికార భాష జర్మన్, కరెన్సీ యూరో. ఆదిమానవుల అవశేషాలు బయటపడిన నియాండర్తల్ లోయతో పాటు ఆధునిక కాలం వరకు ఘనమైన చరిత్రను జర్మనీ కలిగియుంది. రెండో ప్రపంచయుద్ధంలో అపజయం పాలై జర్మనీ రెండు ముక్కైలైననూ పరిమిత కాలంలోనే కోలుకొని మహత్తర ఆర్థికశక్తిగా ఎదిగింది. ప్రముఖ సంగీతకారుడు బీథోవాన్, ప్రముఖ తత్వవేత్త కార్ల్ మార్క్స్, ప్రముఖ రేసింగ్ డ్రైవర్ మైకేల్ షుమాకర్, నియంత అడాల్ఫ్ హిట్లర్, ప్రముఖ ఆర్థికవేత్త షుంపీటర్, అచ్చుయంత్రాన్ని కనుగొన్న గూటెన్‌బర్గ్, ప్రముఖ శాస్త్రవేత్తలు ఐన్‌స్టీన్, మాక్స్ ప్లాంక్, రాంట్‌జన్, ఒట్టోహాన్, రాబర్ట్ కోచ్, హెర్ట్స్, కెప్లర్, రుడాల్ఫ్ డీజిల్, కొప్పెన్, జార్జ్ సిమాన్ ఓం జర్మనీకి చెందినవారు.


భౌగోళికం:
మధ్య మరియు పశ్చిమాసియాలో భాగమైన జర్మనీ 3.57 లక్షల చకిమీ వైశాల్యంతో ప్రపంచంలో 62వ స్థానంలోనూ, 8.3 కోట్ల జనాభాతో ప్రపంచంలో 19వ స్థానంలోనూ ఉంది. యూరప్‌లో అత్యధిక జనాభా కల్గిన దేశాలలో రష్యా తర్వాత జర్మనీ రెండోస్థానంలో ఉంది. జర్మనీకి ఉత్తరాన బాల్టిక్ మరియు ఉత్తర సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. డెన్మార్క్, పోలాండ్, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, లక్సెంబర్గ్, బెల్జియం, నెదర్లాండ్స్ జర్మనీ యొక్క సరిహద్దు దేశాలు. జర్మనీలో ప్రవహించు ముఖ్యమైన నదులు డాన్యూబ్, ఓడర్, రైన్, ఎల్బే నదులు. ఆల్ప్స్ పర్వాతాలు జర్మనీలో వ్యాపించియున్నాయి. దేశంలోని పెద్ద నగరాలు బెర్లిన్, హాంబర్గ్, బాన్, ఫ్రాంక్‌ఫర్డ్, మ్యూనిచ్, స్టట్‌గార్ట్.
నాజీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్

చరిత్ర:
ప్రాచీన కాలం నుంచే జర్మనీ ఘనమైన చరిత్రను కల్గియుంది. ఆదిమానవుల అవశేషాలు లభ్యమైన నియాండర్తల్ లోయ జర్మనీలో ఉంది. మధ్యయుగంలో ప్రసిద్ధిచెందిన పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో ప్రస్తుత జర్మనీ ప్రాంతం కేంద్రస్థానంగా ఉండేది. 1618-48 కాలంలో జర్మనీలో 30 సంవత్సరాల యుద్ధం జరిగింది. మధ్యయుగంలో మతసంస్కరణలకు జర్మనీ కేంద్రబిందువుగా మారింది. మతసంస్కరణ ఉద్యమాన్ని ఆరంభించినది మార్టిన్ లూథర్ జర్మనీకి చెందినవాడు. పవిత్ర రోమన్ సామ్రాజ్యం పతనానంతరం 1815లో జర్మన్ సమాఖ్య అవతరించింది. 1918లో మొదటి ప్రపంచయుద్ధంలో జర్మనీ ఓడిపోయింది. ఆ తర్వాత 1918-19 కాలంలో జర్మనీ విప్లవం చెలరేగింది. విప్లవం తర్వాత 1919లో రాజరికం స్థానంలో వైమర్ రిపబ్లిక్ ఏర్పడి గణతంత్రరాజ్యంగా మారింది. 1919లో ఓడిపోయిన జర్మనీని వర్సయిల్స్ ఒప్పందంపై మిత్రరాజ్యాలు బలవంతంగా సంతకం చేయించాయి. ఈ అవమానకర సంఘటనే జర్మనీలో నాజీయిజం పెర్గడానికి దోహదపడింది. 1933లో జర్మనీని హిట్లర్ నేతృత్వంలోని నాజీలు అధీనంలోకి తెచ్చుకున్నారు. 1939లో జర్మనీ పోలాండ్‌ను ఆక్రమించుటతో రెండో ప్రపంచయుద్ధం మొదలైంది. చివరికి రెండో ప్రపంచయుద్ధంలో జర్మనీ ఓటమి చెందింది. రెండో ప్రపంచయుద్ధం సమయంలో జర్మనీకి చెందిన 20 లక్షల సైనికులు మరణంతో పాటు అపార ఆస్తినష్టం కలిగింది. అంతేకాకుండా రెండో ప్రపంచయుద్ధం తర్వాత జర్మనీ రెండు ముక్కలైంది. తూర్పు జర్మనీ బెర్లిన్ రాజధానిగా, పశ్చిమ జర్మనీ బాన్ రాజధానిగా పాలించాయి. 1961లో రెండు జర్మనీలను విభజిస్తూ బెర్లిన్ గోడ కూడా నిర్మించబడింది. 1990లో జర్మనీ మళ్ళీ ఏకీకరణ సాధించింది.

ఆర్థికం:
ప్రపంచంలోనే ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలలో జర్మనీ ఒకటి. అభివృద్ధి చెందిన దేశాల కూటమిగా పేరుపొందిన జి-7లో కూడా జర్మనీ భాగంగా ఉంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రూర్ ప్రాంతం జర్మనీ పారిశ్రామిక అభివృద్ధికి మూలంగా నిలిచింది. ఫ్రాంక్‌ఫర్డ్ జర్మనీ ఆర్థిక రాజధానిగా పిల్వబడుతోంది. స్థూల జాతీయోత్పత్తిలో జర్మనీ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 4వ స్థానంలో, పిపిపి ప్రకారం 5వ స్థానంలో ఉంది. BMW, ఓక్స్ వాగన్ మరియు మెర్సిడెజ్ కార్లు జర్మనీలో తయారౌతాయి.
గోల్డెన్ స్లాం సాధించిన స్టెఫీగ్రాఫ్

క్రీడలు:
జర్మనీ దేశ జనాదరణ కల్గిన క్రీడ ఫుట్‌బాల్. 1934, 1978, 1990, 2014లలో జర్మనీ ఫుట్‌బాల్ జట్టు ఫీఫా కప్ గెల్చింది. 1936లో బెర్లిన్, 1972లో మ్యూనిచ్ నగరాలు ఒలింపిక్ క్రీడలను నిర్వహించాయి. సాకర్ డరివర్ మైకేల్ షుమాకర్, టెన్నిస్ క్రీడాకారులు స్టెఫీగ్రాఫ్, బొరిస్ బెకర్, స్విమ్మింగ్ క్రీడాకారిణి క్రిస్టన్ ఒట్టో, ఫుట్‌బాల్ దిగ్గజం మిరొస్లావ్ క్లోజ్ జర్మనీకి చెందినవారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: ప్రపంచ దేశాలు, జర్మనీ


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక