జమ్మికుంట కరీంనగర్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 20 గ్రామపంచాయతీలు, 9 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం ఉత్తర సరిహద్దు గుండా మానేరునది ప్రవహిస్తుంది.
అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో జమ్మికుంట మండలాన్ని రెండుగా విభజించి 10 రెవెన్యూ గ్రామాలతో కొత్తగా ఇల్లంతకుంట మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున ఎల్లందకుంట మండలం, పశ్చిమాన వీణవంక మండలం, నైరుతిన హుజురాబాదు మండలం, దక్షిణాన వరంగల్ పట్టణ జిల్లా, ఉత్తరాన పెద్దపల్లి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం ఉత్తర సరిహద్దు గుండా మానేరునది ప్రవహిస్తుంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 103688. ఇందులో పురుషులు 52182, మహిళలు 51506. అక్షరాస్యుల సంఖ్య 63713. పట్టణ జనాభా 11242, గ్రామీణ జనాభా 92446. రాజకీయాలు: ఈ మండలము హుజురాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన దొడ్డె మమత, జడ్పీటీసిగా తెరాసకు చెందిన శ్రీరాం వెంకటస్వామి ఎన్నికయ్యారు.
జమ్మికుంట మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bijigirisharif, Dharmaram (PB), Jammikunta, Korapalli, Madipalli, Saidabad, Thanugula, Vavilala, Vilasagar,
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
గండ్రపల్లి (Gandrapalli): గండ్రపల్లి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామానికి చెందిన సుగుణాకర్ రావు భాజపాకు చెందిన ప్రముఖ నాయకుడు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా, కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శిగా 2013 మే 21న రెండోసారి నియమించబడ్డారు.
జమ్మికుంట (Jammikunta):
జమ్మికుంట కరీంనగర్ జిల్లాకు పట్టణము మరియు మండల కేంద్రము. ఇది పురపాలక సంఘంగా ఉంది. పట్టణంలో ప్రముఖ ఆలయాలు అనేకం ఉన్నాయి. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ పత్తి క్రయవిక్రయాలకు ప్రసిద్ధి. పిన్‌కోడ్ 505122.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Jammikunta Mandal in Telugu, Karimnagar Dist (district) Mandals in telugu, Karimnagar Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి