కరీంనగర్ కరీంనగర్ జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్య్వస్థీకరణ సమయంలో కరీంనగర్ మండలాన్ని మూడు భాగాలుగా చేసి కొత్తగా కరీంనగర్ గ్రామీణ మండలం, కొత్తపల్లి మండలాలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం మండలం పూర్తిగా పట్టణ ప్రాంతంగా ఉంది. ఇది కరీంనగర్ నగరపాలక సంస్థలో భాగంగా ఉంది. తొలితరం సినిమా నటుడు దాదాసాహెబ్ ఫాల్కే గ్రహీత పైడిపాటి జైరాజ్ ఈ మండలమునకు చెందినవారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున మరియు ఈశాన్యాన కరీంనగర్ గ్రామీణ మండలం, దక్షిణాన తిమ్మాపూర్ మండలం, నైరుతిన గన్నేరువరం మండలం, పశ్చిమాన మరియు ఉత్తరాన కొత్తపల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణ సరిహద్దు గుండా మానేరునది ప్రవహిస్తుంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 362767. ఇందులో పురుషులు 182678, మహిళలు 180089. రాజకీయాలు: ఈ మండలము కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. రవాణా సౌకర్యాలు: కరీంనగర్ జిల్లాకేంద్రం కావడంతో నలువైపుల నుంచి ప్రధాన రహదారులున్నాయి. కామారెడ్డి, జగిత్యాల, వరంగల్, మంచిర్యాల నుంచి ప్రధాన రోడ్డుమార్గాలున్నాయి. పెద్దపల్లి నుంచి నిజామాబాదు వరకు నిర్మిస్తున్న రైలుమార్గం కరీంనగర్ వరకు పూర్తయింది. కాలరేఖ:
కరీంనగర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Karimnagar, Pothugal, Hasnapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కరీంనగర్ (Karimnagar): కరీంనగర్ నగరము తెలంగాణలోని ప్రముఖ నగరాలలో ఒకటి మరియు జిల్లాకేంద్రము. తొలితరం సినీ కథానాయకుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి తెలుగు వ్యక్తి పైడిపాటి జైరాజ్ కరీంనగర్‌లో జన్మించాడు..
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Karimnagar Urban Mandal in Telugu, Karimnagar Dist (district) Mandals in telugu, Karimnagar Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి