హుజురాబాదు కరీంనగర్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 19 గ్రామపంచాయతీలు, 12 రెవెన్యూ గ్రామాలు కలవు. హుజూరాబాదు సమీపంలో గొడిశల గ్రామంలో కాకతీయులు నిర్మించిన ప్రాచీనమైన ఆలయం ఉంది. మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఈ మండలమునకు చెందినవారు. 2018లో రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి ఈ మండలం ఇందిరానగర్ లో ప్రారంభించారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన వీణవంక మండలం, ఈశాన్యాన జమ్మికుంట మండలం, పశ్చిమాన వి.సైదాపూర్ మండలం, వాయువ్యాన శంకరపట్నం మండలం, తూర్పున వరంగల్ పట్టణ జిల్లా, దక్షిణాన వరంగల్ గ్రామీణ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 74598. ఇందులో పురుషులు 37336, మహిళలు 37262. అక్షరాస్యుల సంఖ్య 48200. అక్షరాస్యత శాతం 70.08%. రాజకీయాలు: ఈ మండలము హుజురాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2014 జూలైలో ఎంపిపిగా వొడితల సరోజినీదేవి ఎన్నికయ్యారు. (ఈమె హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తల్లి, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు భార్య). 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన ఇరుముల్ల రాణి, జడ్పీటీసిగా తెరాసకు చెందిన పడిదం బక్కారెడ్డి ఎన్నికయ్యారు.
హుజురాబాదు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bornapalli, Chelpur, Dharmarajupalli, Huzurabad, Jupaka, Kandugula, Kanukulagidda, Katrepalli, Pothireddipet, Singapur, Sirsapalli, Thummanapalli,
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
హుజురాబాదు (Huzurabad): హుజురాబాదు కరీంనగర్ జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. ఇది పురపాలక సంఘంగా ఉంద్. హుజూరాబాదు సమీపంలో గొడిశల గ్రామం ఉంది. ఆ గ్రామానికి 2 కిమీ దూరంలో కాకతీయులు నిర్మించిన ప్రాచీనమైన ఆలయం ఉంది. టెలివిజన్ సీరియల్ నటి శ్రీలత ఈ పట్టణానికి చెందినది. ఈమె 70కి పైగా సీరియళ్ళలో నటించింది. సింగాపురం (Singapur): సింగాపురం కరీంనగర్ జిల్లా హుజురాబాదు మండలమునకు చెందిన గ్రామము. రాజకీయ నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన రాజేశ్వరరావు (కెప్టెన్ సోదరుడు) ఈ గ్రామానికి చెందినవారు. హరితహారంలో చేసిన కృషికి ఈ పంచాయతీకి హరితమిత్ర అవార్డు లభించింది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Huzurabad Mandal in Telugu, Karimnagar Dist (district) Mandals in telugu, Karimnagar Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి