9, ఆగస్టు 2020, ఆదివారం

అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)

రాజధాని
ఈటానగర్
వైశాల్యం
83743 చకిమీ
జనాభా
13.82 లక్షలు (2011)
అధికార భాష
ఇంగ్లీష్
అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో ఒకటి. 1987లో రాష్ట్రంగా అవతరించిన అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో సూర్యుడు ఉదయించు భూమి గా పేరుపొందింది. రాష్ట్రం పేరుకు అర్థం కూడా సూర్యుడు ఉదయించే ప్రాంతం. రాష్ట్ర భాష ఇంగ్లీష్, రాజధాని మరియు పెద్ద పట్టణం ఈటానగర్. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రవహించు ముఖ్యమైన నదులు కామెంగ్, సుబన్సిరి, సియాంగ్ (బ్రహ్మపుత్ర), దిబాంగ్, లోహిత్, నొవాదిహింగ్. ప్రజల ప్రధాన జీవనాధారం మరియు ఆర్థిక వ్యవస్థకు కీలకమైనది వ్యవసాయం.

భౌగోళికం:
అరుణాచల్ ప్రదేశ్ 26-29° ఉత్తర అక్షాంశం, 91-97° తూర్పు రేఖాంశంల మధ్య ఉంది. 83743 చకిమీ వైశాల్యంలో దేశంలో 14వ స్థానంలో ఉన్న ఈ రాష్ట్రం అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలు, భూటాన్, మయన్మార్, చైనాలు దేశాలను సరిహద్దుగా కల్గియుంది. అరుణాచల్ ప్రదేశ్ మరియు చైనాల మధ్య మెక్‌మోహన్ సరిహద్దు రేఖ ఉంది. ఇది భారత్‌-చైనాల మధ్య సరిహద్దు రేఖ. సియాంగ్ (బ్రహ్మపుత్ర) నదిపై అప్పర్ సియాంగ్ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించబడింది. రాష్ట్రంలో 25 జిల్లాలు కలవు.

చరిత్ర:
మొదట అస్సాంలో భాగంగా ఉండి ఆ తర్వాత కేంద్రపాలిత ప్రాంతంగా, 1987లో రాష్ట్రంగా అవతరించింది. ప్రాచీనమైన తవాంగ్ భౌద్దక్షేత్రం అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది. 6వ దలైలామా ఇక్కడే జన్మించాడు. 1962లో ఈ ప్రాంతంపై చైనా దాడి చేసింది. ఈ ప్రాంతాన్ని చైనా తనదిగా చెప్పుకుంటోంది. అరుణాచల్ ప్రదేశ్‌ను భారతీయ ప్రముఖులు సందర్శించే సందర్భంలో కూడా చైనా అభ్యంతరపరుస్తోంది.

రాజకీయాలు:
అరుణాచల్ ప్రదేశ్‌లో 2 లోక్‌సభ స్థానాలు, ఒక రాజ్యసభ స్థానం, 60 శాసనసభ స్థానాలు కలవు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, అరుణాచల్ ప్రదేశ్ పీపుల్స్ పార్టీ, భారతీయ జనతాపార్టీలు ప్రాబల్యంలో ఉన్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి పెమాఖండూ భాజపాకు చెందినవారు.
 
 


హోం
విభాగాలు: భారతదేశ రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక