పరకాల వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 5ఎంపీటీసి స్థానాలు, 10 గ్రామపంచాయతీలు, 11 రెవెన్యూ గ్రామాలు కలవు. తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్ ఎస్.మధుసూధనచారి ఈ మండలమునకు చెందినవారు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో వరంగల్ గ్రామీణ జిల్లాలో భాగమైంది. ఆగస్టు 2018లో పరకాల మండలాన్ని విభజించి కొత్తగా నడికూడ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదే సమయంలో వరంగల్ గ్రామీణ రెవెన్యూ డీవిజన్ నుంచి కొత్తగా ఏర్పడిన పరకాల రెవెన్యూ డీవిజన్‌లోకి మారింది.
భౌగోళికం, సరిహద్దులు:
పరకాల మండలం వరంగల్ గ్రామీణ జిల్లాలో అతి ఉత్తరాన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మరియు వరంగల్ పట్టణ జిల్లాల సరిహద్దులో ఉంది. ఈ మండలానికి దక్షిణాన, ఆగ్నేయాన శాయంపేట మండలం, పశ్చిమాన నడికూడ మండలం మరియు వరంగల్ పట్టణ జిల్లా, తూర్పున మరియు ఉత్తరాన జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. చరిత్ర: కాకతీయ సామ్రాజ్య పాలనలో ఈ ప్రాంతం భాగంగా ఉండేది. నిరంకుశ నిజాం పాలనలో, నిజాం విమోచనోద్యమంలో పరకాల పోరాటగడ్డగా పేరుపొందింది. సెప్టెంబరు 2, 1947న నిజాం పోలీసు కాల్పులలో 13మంది పోరాటయోధులు మరణించారు. విమోచన అనంతరం హైదరాబాదు రాష్ట్రంలోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వరంగల్ జిల్లాలో భాగంగా, 2016 జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో వరంగల్ గ్రామీణ జిల్లాలో భాగంగా మారింది. 2018లో పరకాల కేంద్రంగా ప్రత్యేక రెవెన్యూ డీవిజన్ ఏర్పడింది.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 80659. ఇందులో పురుషులు 40133, మహిళలు 40526.
రాజకీయాలు:
ఈ మండలము పరకాల అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగము. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన మచ్చ టి.స్వర్ణలత, జడ్పీటీసి ఎన్నికలలో తెరాసకు చెందిన మొగిలి సిలివేరు ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Kamareddipalli, Laxmipuram, Madharam, Mallakpet, Nagaram, Paidipalli, Parkal, Pocharam, Rajipet, Vellampalli, Venkatapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
నర్సక్కపల్లి (Narsakkapalli): నర్సక్కపల్లి వరంగల్ జిల్లా పరకాల మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో గురుకుల పాఠశాల ఉంది. ఈ గ్రామానికి చెందిన సిరికొండ మధుసూధనచారి జూన్ 9, 2014న తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకరుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Athmakur Mandal in Telugu, Warangal Rural Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి