13, జూన్ 2020, శనివారం

నంద్యాల (Nandyal)

నంద్యాల
జిల్లాకర్నూలు
జనాభా2.11 లక్షలు
పిన్‌కోడ్518501 -02
ప్రాచీననామంనందియాల
నంద్యాల కర్నూలు జిల్లాకు చెందిన పట్టణము. ఇది పురపాలక సంఘము, రెవెన్యూ డివిజన్ కేంద్రము, అసెంబ్లీ మరియు లోక్‌సభ నియోజకవర్గం కేంద్రముగా ఉంది. నంద్యాలకు పశ్చిమ వైపు నుంచి కుందూనది ప్రవహిస్తోంది. 2011 ప్రకారం నంద్యాల జనాభా 2.11 లక్షలు. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 19వ పెద్ద పట్టణం. పింగళి సూరన నంద్యాలలోనే నివశించారు

చరిత్ర:
నంద్యాల చాలా పురాతనమైన చరిత్రను కల్గియుంది. ఉత్తర భారతదేశాన్ని ఏలిన నందవంశపు నాటి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి నవనందులను ప్రతిష్టించినట్లుగా, తద్వారా నందియాలగా పేరువచ్చినట్లుగా, అదే క్రమేణా నంద్యాల అయినట్లుగా చారిత్రక కథనం వ్యాప్తిలో ఉంది. ఆ తర్వాత విజయనగరరాజుల పాలనలో వచ్చే వరకు నంద్యాల చరిత్ర గురించి ఆధారాలు లేవు. విజయనగర రాజుల తర్వాత ఈ ప్రాంతాన్ని బీజాపూర్ సుల్తానులు, గోల్కొండ సుల్తానులు పాలించగా 1800లో సైన్యసహకార ఒడంబడిక ప్రకారం బ్రిటీష్ వారికి ధారాదత్తం చేసిన దత్తమండలం (సీడెడ్ జిల్లా)లో భాగమై బ్రిటీష్ వారి అధీనంలోకి వచ్చింది. 1899లో నంద్యాల పురపాలక సంఘంగా మారింది. బ్రిటీష్ కాలంలో మద్రాసు ప్రెసైడెన్షీలో భాగంగా ఉండగా, స్వాతంత్ర్యానంతరం మద్రాసు రాష్ట్రంలో భాగమైంది. 1953లో ఆంధ్రరాష్ట్రంలో, 1956లో ఆంధ్రప్రదేశ్‌లో భాగమై, 2014 నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఉంది.

రవాణా సౌకర్యాలు:
1890లో నంద్యాలకు రైలుమార్గం ఏర్పడింది. ప్రస్తుతం నంద్యాల జంక్షన్ గుంటూరు డివిజన్‌లో భాగంగా దక్షిణ మధ్యరైల్వే జోన్‌లో ఉంది. జాతీయ రహదారి నెం 18 (కొత్తపేరు నెం 40) నంద్యాల మీదుగా వెళ్ళుచున్నది.

రాజకీయాలు:
నంద్యాల అసెంబ్లీ మరియు లోక్‌సభ నియోజకవర్గం కేంద్రంగా ఉంది. పివి నరసింహరావు ప్రధానమంత్రిగా నంద్యాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. పెండేకంటి వెంకటసుబ్బయ్య ఇకడి నుంచి 6 సార్లు విజయం సాధించారు. 1977లో నీలం సంజీవరెడ్డి గెలిచారు.


ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ పట్టణాలు, కర్నూలు జిల్లా,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక