నెక్కొండ వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన మండలము.మండలంలో 16 ఎంపీటీసి స్థానాలు, 39 గ్రామపంచాయతీలు, 19 రెవెన్యూ గ్రామాలు కలవు. కాజీపేట నుంచి విజయవాడ వెళు రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో వరంగల్ గ్రామీణ జిల్లాలో భాగంగా మారింది.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన మరియు ఈశాన్యాన చెన్నారావుపేట మండలం, పశ్చిమాన పర్వతగిరి మండలం, వాయువ్యాన సంగెం మండలం, తూర్పున మరియు దక్షిణాన మహబూబాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 49187. ఇందులో పురుషులు 24736, మహిళలు 24451.
రాజకీయాలు:
ఈ మండలము నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన జాటోతు రమేష్, జడ్పీటీసి ఎన్నికలలో తెరాసకు చెందిన లావుడి సరోజ ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Alamkhanipet, Ameenpet h/o Ameenabad, Appalaraopet, Bollikonda, Chandrugonda, Chinnakorpole, Deekshakunta, Gotlakonda, Gundrepalli, Mudigonda, Nagaram, Nekkonda, Panikera, Pathipaka, Peddakorpole, Redlawada, Suripalli, Topanpalli, Venkatapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
నాగారం (Nagaram): నాగారం వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన మండలము. ఈ గ్రామానికి చెందిన చిల్లా రాందాస్ మండలాధ్యక్షుడిగా పనిచేశారు. పదవిలో ఉంటూ 2010లో మరణించారు.
తిపనపల్లి (Tipanapalli):
తిపనపల్లి వరంగల్ జిల్లా నెక్కొండ మండలమునకు చెందిన గ్రామము. వాలీబాల్ క్రీడలో అనేక మందిని అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దిన కందుకూరి కొమురయ్య ఈ గ్రామానికి చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Nekkonda Mandal in Telugu, Warangal Rural Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి