చెన్నారావుపేట వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 30 గ్రామపంచాయతీలు, 11 రెవెన్యూ గ్రామాలు కలవు. స్వాతంత్ర్య సమరయోధుడు కంది మల్లారెడ్డి ఈ మండలమునకు చెందినవారు.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన నర్సంపేట మండలం, ఈశాన్యాన ఖానాపూర్ మండలం, నైరుతిన మరియు పశ్చిమాన నెక్కొండ మండలం, వాయువ్యాన సంగెం మండలం, తూర్పున మరియు ఆగ్నేయాన మహబూబాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 53032. ఇందులో పురుషులు 26749, మహిళలు 26283.
రాజకీయాలు:
ఈ మండలము నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన బాదావత్ విజేందర్, జడ్పీటీసి ఎన్నికలలో తెరాసకు చెందిన బానోతు పతినాయక్ ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Akkalchedu, Ameenabad, Chennaraopet, Jhalli, Konapuram, Lingagiri, Lingapuram, Papaiahpeta, Thimmarainipahad, Upparapalli, Yellaigudem
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అమీనాబాదు (Ameenabad): అమీనాబాదు వరంగల్ గ్రామీణ జిల్లాకు చెన్నారావుపేట మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామానికి చెందిన దొంతి మాధవరెడ్డి డీసీసీబి చైర్మెన్‌గా, ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Chennaraopet Mandal in Telugu, Warangal Rural Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి