నర్సంపేట వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 27 గ్రామపంచాయతీలు, 15 రెవెన్యూ గ్రామాలు కలవు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో వరంగల్ గ్రామీణ జిల్లాలో భాగంగా మారింది.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన నల్లబెల్లి మండలం, తూర్పున ఖానాపూర్ మండలం, దక్షిణాన చెన్నారావుపేట మండలం, పశ్చిమాన దుగ్గొండి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 67162. ఇందులో పురుషులు 33977, మహిళలు 33185. మండలంలో పట్టణ జనాభా 30968, గ్రామీణ జనాభా 36194.
రాజకీయాలు:
ఈ మండలము నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన మోతె కళమ్మ, జడ్పీటీసి ఎన్నికలలో తెరాసకు చెందిన కొమండ్ల జయమ్మ ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Bhanjipet, Gurijala, Itikalpalli, Kammepalli, Laknepalli, Madannapet, Madhira (D), Maheshwaram, Makdumpuram, Muthojipet, Narsampet, Paspunur, Rajupet, Ramavaram, Sarwapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
మహేశ్వరం (Maheshwaram): మహేశ్వరం వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట మండలమునకు చెందిన గ్రామము. 19వ శతాబ్దికి చెందిన కవి సంకరనేని రాజమౌళి ఈ గ్రామానికి చెందినవారు. నర్సంపేట (Narsampet): నర్సంపేట వరంగల్ జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము, పురపాలక సంఘము మరియు రెవెన్యూ డివిజన్ కేంద్రము. రైస్ మిల్లులు, ఆటోమొబైల్స్, ఐరన్ హార్డ్‌వేర్ వ్యాపారానికి ఈ పట్టణం ప్రసిద్ధి.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Narsampet Mandal in Telugu, Warangal Rural Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి