7, జూన్ 2020, ఆదివారం

పాల్వాయి గోవర్థన్ రెడ్డి (Palvai Govardhan Reddy)

పాల్వాయి గోవర్థన్ రెడ్డి
జననం
నవంబరు 20, 1936
రంగం
రాజకీయాలు
పదవులు
5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడు
మరణం
జూన్ 9, 2017
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడిగా పేరుపొందిన పాల్వాయి గోవర్థన్ రెడ్డి నవంబరు 20, 1936న నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లిలో జన్మించారు. ఈయన స్వస్థలం నల్గొండ జిల్లా చండూరు మండలం. కాంగ్రెస్ పార్టీకి చెందిన పాల్వాయి గోవర్థన్ రెడ్డి 5 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నిక కావడమే కాకుండా భవనం వెంకట్రాంరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గాలలో కూడా స్థానం పొందారు. ఒకసారి ఎమ్మెల్సీగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగానూ ఎన్నికైనారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో జూన్ 9, 2017న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి సమావేశానికి హాజరు కావడానికి వెళ్తూ హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలో మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
అభ్యసన దశలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయం NSUI ప్రధానకార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. 1967-84 కాలంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 1981లో భవనం వెంకట్రాంరెడ్డి ముఖ్యమంత్రి కాలంలో మంత్రిమండలిలో, ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం పొందారు. 1999లోపాల్వాయి 5వ సారి శాసనసభకు ఎన్నికైనారు. 2007-09 కాలంలో ఎమ్మెల్సీగా వ్యవహరించారు. 2012లో రాజ్యసభకు ఎన్నికైనారు.

ఇవి కూడా చూడండి:
  • నల్గొండ జిల్లా ప్రముఖులు,

హోం
విభాగాలు: నల్గొండ జిల్లా ప్రముఖులు, తెలంగాణ రాజకీయ నాయకులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక