ధర్మసాగర్ వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 19 గ్రామపంచాయతీలు, 13 రెవెన్యూ గ్రామాలు కలవు. హైదరాబాదు-వరంగల్ జాతీయ రహదారి, సికింద్రాబాదు-కాజీపేట రైల్వేలైన్ మండలం గుండా వెళ్ళుచున్నది. ఈ మండలము స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. తెలంగాణకు చెందిన తొలితరం కథారచయిత పొట్లపల్లి రామారావు ఈ మండలమునకు చెందినవారు.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన ఎల్కతుర్తి మండలం, ఈశాన్యాన హసన్‌పల్లి మండలం, తూర్పున కాజీపేట మండలం, ఆగ్నేయాన ఐనవోలు మండలం, దక్షిణాన జనగామ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 73690. ఇందులో పురుషులు 36669, మహిళలు 37021. మండలంలో పట్టణ జనాభా 2961, గ్రామీణ జనాభా 70729. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన నిమ్మ కవిత, జడ్పీటీసిగా తెరాసకు చెందిన పిట్టల శ్రీలత విజయం సాధించారు.
రాజకీయాలు:
ఈ మండలము స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Devnoor, Dharmapur, Dharmsagar, Elkurthy, Jhanakipur, Kyathampalli, Mallakpalli, Mupparam, Narayanagiri, Peddapendyal, Somadevrapalli, Thatikayala, Unikicherla
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ధర్మసాగర్ (Dharmasagar): ధర్మసాగర్ వరంగల్ పట్టణ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ధర్మసాగరం గ్రామము వరంగల్ పట్టణానికి 23 కిలో మీటర్ల దూరంలో ఖాజీపేట రైల్వేస్టేషన్ నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ ధర్మారావు అనే జాగీర్దారు తవ్వించిన చెరువు ఆయన పేరిట ధర్మసాగరం చెరువుగా ప్రసిద్ధి చెందింది. పెద్దపెండ్యాల (Peddapendyala): పెద్దపెండ్యాల వరంగల్ పట్టణ జిల్లా ధర్మసాగర్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామానికి చెందిన అనూష 2012 ముంబాయి కార్పోరేషన్ ఎన్నికలలో ధారవి నుంచి శివసేన తరఫున కార్పోరేటరుగా ఎన్నికైనది. తాటికాయల (Tatikayala): తాటికాయల వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలమునకు చెందిన గ్రామము. తొలితరం తెలంగాణ కథకుడు పొట్లపల్లి రామారావు ఈ గ్రామానికి చెందినవారు. ఈయన సెప్టెంబర్ 10, 2001న మరణించారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Dharmasagar Mandal in Telugu, Warangal Urban Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి