ఎల్కతుర్తి వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 19 గ్రామపంచాయతీలు, 13 రెవెన్యూ గ్రామాలు కలవు. కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్ళు ప్రధాన రహదారి, కాజీపేట నుంచి బల్హార్షా రైలుమార్గం కూడా మండలం మీదుగా పోవుచున్నవి. స్వాతంత్ర్య సమరయోధుడు బత్తిని ఉప్పలయ్య ఈ మండలమునకు చెందినవారు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కరీంనగర్ నుంచి వరంగల్ పట్టణ జిల్లాకు తరలించబడింది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 39657. ఇందులో పురుషులు 20168, మహిళలు 19489. గృహాల సంఖ్య 9485. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 40504. ఇందులో పురుషులు 19783, మహిళలు 20721. అక్షరాస్యుల సంఖ్య 23900.
రాజకీయాలు:
ఈ మండలము హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన మేకలి స్వప్న, జడ్పీటీసిగా తెరాసకు చెందిన సుధీర్ కుమార్ మారపల్లి విజయం సాధించారు. రవాణా సౌకర్యాలు: కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్ళు ప్రధాన రహదారి మండల కేంద్రం మీదుగా వెళ్ళుచున్నది. కాజీపేట నుంచి బల్హార్షా రైలుమార్గం కూడా మండలం మీదుగా పోవుచున్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Baopet, Damera, Dandepalli, Elkathurthi, Gopalpur, Jeelgul, Keshawapur, Kothulnaduma, Penchikalapeta, Suraram, Thimmapur, Vallabhapur, Veeranarayanapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బాపురావుపేట (Bapuraopet): బాపురావుపేట వరంగల్ పట్టణ జిల్లా ఎల్కతుర్తి మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామం రైల్వే ఉద్యోగులకు ప్రసిద్ధి. కాజీపేట-బల్హార్షా లైనులొ హసన్ పర్తి రోడ్-ఉప్పల్ రైల్వేస్టేషన్ల మధ్యన ఈ గ్రామం ఉంది. 1962లో రైల్వేట్రాక్ వేస్తున్నప్పుడు 200 మంది గ్యాంగ్ మెన్లుగా విధుల్లో చేరారు. అంచెలంచెలుగా కొందరు పదోన్నతిపై ఉన్నత స్థానం పొందారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Elkathurthy or Yelkaturthy Mandal in Telugu, Warangal Urban Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి