19, జులై 2020, ఆదివారం

కేసముద్రం మండలం(Kesamudram Mandal)

కేసముద్రం మండలం
జిల్లా మహబూబాబాదు
రెవెన్యూ డివిజన్ మహబూబాబాదు
అసెంబ్లీ నియోజకవర్గంమహబూబాబాదు
లోకసభ నియోజకవర్గంమహబూబాబాదు
కేసముద్రం మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 21 ఎంపీటీసి స్థానాలు, 40 గ్రామపంచాయతీలు, 17 రెవెన్యూ గ్రామాలు కలవు. కాజీపేట నుంచి విజయవాడ వెళ్ళు రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నది. నిజాం విమోచనోద్యమకారుడు వోలం బసవరాజు, పత్రికా సంపాదకులు ఒద్దిరాజు సోదరులు ఈ మండలమునకు చెందినవారు. 1920లో ఒద్దిరాజు సోదరులు ఇనుగుర్తి నుంచి తెలుగు పత్రికను వెలువరించారు.

అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంంలో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాదు జిల్లాలో చేరింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో నెల్లికుదూరుకు చెందిన ఒక రెవెన్యూ గ్రామం ఈ మండలంలో కల్పబడింది. 

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన గూడూరు మండలం, తూర్పున మరియు ఆగ్నేయాన మహబూబాబాదు మండలం, దక్షిణాన మరియు పశ్చిమాన నెల్లికుదూరు మండలం, వాయువ్యాన వరంగల్ గ్రామీణ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 66109. ఇందులో పురుషులు 32835, మహిళలు 33274.

రాజకీయాలు:
ఈ మండలము మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన చంద్రమోహన్, జడ్పీటీసిగా తెరాసకు చెందిన రావుల శ్రీనాథ్ రెడ్డి ఎన్నికయ్యారు.



కేసముద్రం మండలం  కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Annaram, Arpanapalli, Beriwada, Dhadnnasari, Intikanne, Inugurthy, Kalwala, Katrapalli, Kesamudram, Komatipalli, Korukondapalli, Mahamoodpatnam, Narayanpur H/o Chinamupparam, Penugonda, Rangapuram, Tallapoosapalli, Upparapalli


ప్రముఖ గ్రామాలు / పట్టణాలు

కేసముద్రం (Kesamudram):
కేసముద్రం మహబూబాబాదు జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం భయంకరమైన అరణ్యాళతో కూడి పులులకు ఆవాసంగా ఉన్నట్లుగా, తద్వారా దీనికి కేసరిముద్రగా పేరువచ్చినట్లుగా, అదే కాకక్రమేణా కేసముద్రంగా పిల్వడినట్లుగా చరిత్ర ప్రకారం తెలుస్తోంది. కేసముద్రంలో రైల్వేస్టేషన్ ఉంది. పిన్‌కోడ్ 506112. గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉంది.
ఇనుగుర్తి (Inugurty):
ఇనుగుర్తి మహబూబాబాదు జిల్లా కేసముద్రం మండలమునకు చెందిన గ్రామము. 1920లో తెలుగు పత్రికను స్థాపించిన ఒద్దిరాజు సోదరులు ఈ గ్రామానికి చెందినవారు.
ఉప్పరపెల్లి (Upperapelli):
ఉప్పరపెల్లి మహబూబాబాదు జిల్లా కేసముద్రం మండలమునకు చెందిన గ్రామము. నిజాం విమోచనోద్యమంలో పాల్గొన్న వోలం బసవరాజు ఈ గ్రామస్థుడే. ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఎం.సమత జాతీయస్థాయి క్రీడాకారిణి. 


ఇవి కూడా చూడండి:
  • కేసముద్రం రైల్వేస్టేషన్,
  • కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటి,


ఫోటో గ్యాలరీ
c
c
c c


హోం
విభాగాలు: మహబూబాబాదు జిల్లా మండలాలు,  కేసముద్రం మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Warangal Dist, 2016,
  • Handbook of Census Statistics, Warangal District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 235 తేది: 11-10-2016 
  • వరంగల్ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://mahabubabad.telangana.gov.in/te/ (Official Website of Mahabubabad Urban Dist),


Kesamudram Mandal in Telugu, Mahabubabad Dist (district) Mandals in telugu, Mahabubabad Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక