ఖిలావరంగల్ వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన మండలము. భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో తూర్పువైపున వరంగల్ గ్రామీణ జిల్లా సరిహద్దులో ఉంది.మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్‌లో భాగంగా ఉంది.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. వరంగల్ మండలంలోని 3 గ్రామాలు, హన్మకొండ మండలంలోని 4 గ్రామాలు, గీసుకొండ మండలంలోని 2 గ్రామాలు, సంగం మండలంలోని 2 గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన వరంగల్ మండలం, దక్షిణాన ఐనవోలు మండలం, పశ్చిమాన కాజీపేట మండలం, తూర్పున వరంగల్ గ్రామీణ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము వర్థన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2015 ఉపఎన్నికలో మరియు 2019లో వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో తెరాస నుంచి విజయం సాధించిన పసునూరు దయాకర్ ఈ మండలానికి చెందినవారు. రవాణా సౌకర్యాలు:
ఖిలావరంగల్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Khila Warangal, Urus, Rangasaipet, Allipur, Thimmapur, Mamnoor, Nakkalapalli, Vasanthapur , Stambampalli, Bollikunta, Gadepalli
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బొల్లికుంట (Bollikunta): బొల్లికుంట వరంగల్ పట్టణ జిల్లా ఖిలా వరంగల్ మండలమునకు చెందిన ప్రాంతము. ఇది గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్‌లో భాగము. 2015లో వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో తెరాస నుంచి విజయం సాధించిన పసునూరు దయాకర్ ఈ ప్రాంతానికి చెందినవారు. మామునూరు (Mamnoor): మామునూరు వరంగల్ పట్టణ జిల్లాకు చెందిన ప్రాంతము. ఇక్కడ విమానాశ్రయం ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Khila Warangal Mandal in Telugu, Warangal Urban Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి