వేలేరు వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన మండలము. భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో అతిపశ్చిమాన సిద్ధిపేట మరియు జనగామ జిల్లాల సరిహద్దులో ఉంది. ఈ మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 14 గ్రామపంచాయతీలు, 10 రెవెన్యూ గ్రామాలు కలవు.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. పూర్వ వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని 8 గ్రామాలు, కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని 2 గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన భీమదేవరపల్లి మండలం, తూర్పున ధర్మసాగర్ మండలం, దక్షిణాన జనగామ జిల్లా, పశ్చిమాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
రాజకీయాలు:
ఈ మండలము స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన కేసిరెడ్డి సమ్మిరెడ్డి, జడ్పీటీసిగా తెరాసకు చెందిన చాడ సరిత విజయం సాధించారు. కాలరేఖ:
వేలేరు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Errabelli, Gundla Sagar, Kammaripet H/o Velair, Kannaram, Maddelagudem H/o Peechara, Mallikudurla, Peechara, Shalapally H/o Velair, Sodashapalli, Velair
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కన్నారం (Kannaram): కన్నారం వరంగల్ (అర్బన్) జిల్లాకు చెందిన మండలము. 2016 జిల్లాల పునర్విభజనకు ముందు ఈ గ్రామం కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఉండేది. మార్చి 14, 2019న గ్రామ శివారులో ఆదిమానవుల సమాధులు (డాల్మన్) గుర్తించారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Velair Mandal in Telugu, Warangal Urban Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి