ఐనవోలు వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 17 గ్రామపంచాయతీలు, 10 రెవెన్యూ గ్రామాలు కలవు. భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో అతి దక్షిణాన ఉంది. మండలకేంద్రం ఐనవోలులో ప్రఖ్యాతిచెందిన మల్లన్నస్వామి ఆలయం ఉంది.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. వర్థన్నపేట మండలంలోని 6 గ్రామాలు, హన్మకొండ మండలంలోని 2 గ్రామాలు, జఫర్‌గఢ్ మండలంలోని 2 గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన కాజీపేట మండలం, ఉత్తరాన ఖిలా వరంగల్ మండలం, వాయువ్యాన ధర్మసాగర్ మండలం, తూర్పున మరియు దక్షిణాన వరంగల్ గ్రామీణ జిల్లా, పశ్చిమాన జనగామ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
రాజకీయాలు:
ఈ మండలము వర్థన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన మార్నేవి మధుమతి, జడ్పీటీసిగా తెరాసకు చెందిన గజ్జెల్లి శ్రీరాములు విజయం సాధించారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Inavole, Singaram, Punnole, Nandanam, Kakkiralapalli, Panthini , Kondaparthy, Vanamala , Kanapatrthy , Venkatapuram, Garmillapalli,
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఐనవోలు (Inavolu): ఐనవోలు వరంగల్ పట్టణ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. అక్టోబరు 11, 2016న ఇది కొత్తగా మండల కేంద్రంగా మారింది. అంతకుక్రితం ఈ గ్రామం వర్థన్నపేట మండలంలో ఉండేది. ఐనవోలులో ప్రఖ్యాతిచెందిన మల్లన్నస్వామి ఆలయం ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Inavolu Mandal in Telugu, Warangal Urban Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి