గోవిందరావుపేట ములుగు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 18 గ్రామపంచాయతీలు, 14 రెవెన్యూ గ్రామాలు కలవు. తెలంగాణలో ప్రముఖమైన లక్నవరం సరస్సు ఈ మండలంలో ఉంది. రాష్ట్రంలో తొలిసారిగా నిర్మించిన కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి ఇక్కడే ఏర్పాటుచేశారు. 2016కు ముందు వరంగల్ జిల్లాలో ఉన్న ఈ మండలం అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేరింది. 2019లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాను విభజించి ములుగు జిల్లా ఏర్పాటు చేయడంతో ఈ మండలం ములుగు జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున, ఈశాన్యాన, దక్షిణాన తాడ్వాయి (సమ్మక్క సారక్క) మండలం, నైరుతిన, పశ్చిమాన ములుగు మండలం, వాయువ్యాన వెంకటాపూర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 30998. ఇందులో పురుషులు 15546, మహిళలు 15452.
రాజకీయాలు:
ఈ మండలము ములుగు అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన సూడి శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసిగా తెరాసకు చెందిన తుమ్మల హరిబాబు ఎన్నికయ్యారు.
గోవిందరావుపేట మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bussapur, Chalwai, Dammakkapalle, Kannaigudem, Karlapalle, Laknavaram, Machchapur, Medaram (Pattichalvai), Motlagudem, Muthapur, Pasranagaram, Rampur, Rangapur, Venkatapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కర్లపల్లి (Karlapally): కర్లపల్లి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ గుండ్లవాగు ప్రాజెక్టు ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Govindraopet Mandal in Telugu, Mulugu Dist (district) Mandals in telugu, Mulugu Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి