కన్నాయిగూడ ములుగు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 4 ఎంపీటీసి స్థానాలు, 11 గ్రామపంచాయతీలు, 25 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. ఏటూరునాగారం మండలంలోని గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండలం ములుగు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంది. కంతనపల్లి / తుపాకులగూడెం వద్ద గోదావది నదిపై ప్రాజెక్టు నిర్మించబడింది. 2016కు ముందు వరంగల్ జిల్లాలో ఉన్న ఈ మండల గ్రామాలు అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేరింది. 2019లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాను విభజించి ములుగు జిల్లా ఏర్పాటు చేయడంతో ఈ మండలం ములుగు జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున వాజేడు మండలం, దక్షిణాన ఏటూరునాగారం మండలం, ఉత్తరాన మరియు పశ్చిమాన జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దుగా ఉన్నాయి. మండలం తూర్పు సరిహద్దు గుండా గోదావరినది ప్రవహిస్తోంది.
జనాభా:
.
రాజకీయాలు:
ఈ మండలము ములుగు అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన జనగామ సమ్మక్క, జడ్పీటీసిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నామా కరంచంద్ గాంధీ ఎన్నికయ్యారు.
గోవిందరావుపేట మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Andhukupalle(UI), Bhupathipuram, Buttaigudem, Chinthagudem, Chityala, Devadhumla, Etur, Gangaram, Gangugudem, Gurrevula, Ilapur, Kannaigudem, Kanthanapalli, Kothuru (UI), Laximpur, Malkapally (UI), Marepally (UI), Muppanapalle, Padigapuram (UI), Paredu (UI), Rajannapet, Rampur (UI), Sarvai, Singaram, Tupakulagudem
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
దేవాదుల (Devadula): దేవాదుల ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ దేవాదుల ప్రాజెక్టు నిర్మించారు. కంతనపల్లి (Kanthanapalli): కంతనపల్లి ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామం వద్ద గోదావది నదిపై బ్యారేజీ నిర్మించారు. ఇది "పి.వి.నర్సింహారావు కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు"గా పిల్వబడుతున్నది. తుపాకులగూడెం (Tupakulagudem):
తుపాకులగూడెం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలమునకు చెందిన గ్రామము. గ్రామపరిధిలో పీవీ నరసింహారావు సుజల స్రవంతి పనులు జరుగుతున్నాయి. సమ్మక్కసాగరం బ్యారేజీ గ్రామంలో ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kannaiguda Mandal in Telugu, Mulugu Dist (district) Mandals in telugu, Mulugu Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి