ఘనపురం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 17 గ్రామపంచాయతీలు, 9 రెవెన్యూ గ్రామాలు కలవు. 12వ శతాబ్దికి చెందిన రాటితో నిర్మించిన కోటగుళ్ళుగా ప్రఖ్యాతిగాంచిన దేవాలయ సముదాయాలు ఘనపురంలో ఉన్నాయి. మండలంలోని చెల్పూరులో కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఉంది. అక్టోబరు 11, 2016న జిల్లాల పువర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన, ఈశాన్యాన మరియు వాయువ్యాన భూపాలపల్లి మండలం, నైరుతిన రేగొండ మండలం, తూర్పున ములుగు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం గుండా 353సి జాతీయ రహదారి వెళ్ళుచున్నది.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 35816. ఇందులో పురుషులు 17686, మహిళలు 18130.
రాజకీయాలు:
ఈ మండలము భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షులుగా AIFB పార్టీకి చెందిన కావటి రజిత ఎన్నికైనారు. జడ్పీటీసి సభ్యునిగా AIFB పార్టీకి చెందిన గండ్ర పద్మ విజయం సాధించారు.
ఘనపురం మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Budharam, Burrakayalagudem, Chelpur, Dharmaraopet, Ghanpur, Karkapalli, Kondapur, Mylaram, Thupuram
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
చెల్పూరు (Chelpur): చెల్పూరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామములో కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఉంది. 2006 జూన్ 1న భూమిపూజ చేసి తొలిప్లాంటును మార్చి 31, 2010న ప్రారంభించారు. గ్రామంలో బొగ్గు నిక్షేపాలున్నాయి.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Regonda Mandal in Telugu, Jayashankar Bhupalapalli Dist (district) Mandals in telugu, Bhoopalapally Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి