19, ఆగస్టు 2020, బుధవారం

మహేంద్రసింగ్ ధోని (Mahendra Singh Dhoni)

జననం
జూలై 7, 1981
జన్మస్థానం
రాంచీ (ఝార్ఖండ్)
రంగం
క్రికెట్ క్రీడాకారుడు
భారతజట్టులో స్థానం
2004 నుంచి 2019
గుర్తింపులు
రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డు (2007), పద్మశ్రీ (2009), పద్మభూషణ్ (2018),
భారతదేశానికి చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారునిగా పేరుపొందిన మహేంద్రసింగ్ ధోని జూలై 7, 1981న రాంచీ (ఝార్ఖండ్)లో జన్మించాడు. ఝార్ఖండ్ డైనమైట్‌గా పేరుపొందిన ధోని 2004-19 కాలంలో భారత క్రికెట్ జట్టులో సభ్యుడిగా కొనసాగి వికెట్‌కీపర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు. ధోని తన క్రీడా జీవితంలో 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టి-20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడినాడు. 2004లో తొలిసారిగా బంగ్లాదేశ్‌పై వన్డే మ్యాచ్, 2005లో శ్రీలంకపై తొలి టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించిన ధోని పలు అంతర్జాతీయ రికార్డులు సృష్టించాడు. 2016లో నీరజ్ పాండే దర్శకత్వంలో ధోనిపై M.S. Dhoni: The Untold Story బయోపిక్ నిర్మించబడింది. ఇందులో ధోని పాత్రధారి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించాడు. ఐసిసి 3 ఫార్మట్లలోనూ భారతజట్టుకు ట్రోఫి అందించి ప్రపంచంలోనే ఈ ఘనత పొందిన తొలి కెప్టెన్‌గా అవతరించాడు. ధోని డిసెంబరు 2014లో టెస్టు మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించగా ఆగస్టు 2020లో అన్ని అంతర్జాతీయ ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు.
 
క్రీడా జీవితం:
మహేంద్రసింగ్ ధోని తన 15 సం.ల అంతర్జాతీయ క్రికెట్ జీవితంలో క్రీడాకారునిగా, కెప్టెన్‌గా పలు చిరస్మరణీయమైన విజయాలు భారత జట్టుకు అందించారు. 90 టెస్టులలో 4,876 పరుగులు, 350 వన్డేలలో  10,773 పరుగులు, 98 టి-20 లలో 1,617 పరుగులు చేసిన ధోని వన్డేలలో 10వేల పూర్తి చేసిన నాలుగో భారతీయుడిగా అవతరించారు. టెస్టులలో 224, వన్డేలలో 183 (నాటౌట్) వ్యక్తిగత అత్యధిక పరుగులతో కూడా రికార్డు సృష్టించాడు. టెస్టులలో 224 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కొరు సాధించిన వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. 
 
కెప్టెన్‌గా ధోని రికార్డు మహోన్నతమైనది. ధోని భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించి ఐసిసి టి-20 ప్రపంచకప్ (2007), ఆసియా కప్ (2010 & 2016), ఐసిసి ప్రపంచకప్ (2011), ఐసిసి చాంపియన్స్ ట్రోఫి (2013) సాధించిపెట్టాడు. వన్డేలు, టి-20లను అత్యధిక సార్లు గెలిపించిన భారత కెప్టెన్‌గా ధోని అవతరించాడు. ధోని అత్యధికంగా 332 అంతర్జాతీయ మ్యాచ్‌లకు (టెస్ట్, వన్డే, టి-20) నాయకత్వం వహించి రికార్డు సృష్టించాడు. 2009లో ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్‌లో భారత్‌ను తొలిసారిగా నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాడు. భారత క్రికెట్ కెప్టెన్లలో ధోని అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించారు. 2010, 2011 మరియు 2018లలో ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహించి గెలిపించాడు.
 
గుర్తింపులు:
ధోని 2007లో భారత క్రీడారంగంలో అత్యున్నతమైన రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందారు. భారత ప్రభుత్వం నుంచి 2009లో పద్మశ్రీ, 2018లో పద్మభూషణ్ పురస్కారాలు కూడా పొందారు. భారత టెరిటోరియల్ ఆర్మీ ధోనికి లెఫ్టినెంట్ కొలెనల్ గౌరవం ప్రధానం చేసింది. కపిల్ దేవ్ తర్వాత ఈ గౌరవం పొందిన రెండో క్రికెటర్‌గా ధోని అవతరించారు. 2011లో టైమ్‌ మేగజైన్‌చే ప్రభావశీలులైన 100 వ్యక్తుల జాబితాలో ధోని స్థానం పొందారు.
 


హోం
విభాగాలు: భారత క్రికెట్ క్రీడాకారులు, ఝార్ఖండ్ ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక