అశ్వారావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 17 ఎంపీటీసి స్థానాలు, 30 గ్రామపంచాయతీలు, 20 రెవెన్యూ గ్రామాలు కలవు. సినీదర్శకుడు వెంకటేష్ కుడుముల అశ్వారావుపేటకు చెందినవారు. ఈ మండలానికి చెందిన వగ్గెల మిత్రసేన 2009-14 కాలంలో అశ్వారావుపేట ఎమ్మెల్యేగా పనిచేశారు. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో అతితూర్పున ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉంది. ఈ మండలానికి పశ్చిమాన దమ్మపేట మండలం సరిహద్దు ఉండగా మిగితా అన్నివైపులా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దుగా ఉంది.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 59616. ఇందులో పురుషులు 30050, మహిళలు 29566.
రాజకీయాలు:
ఈ మండలము అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఈ మండలము సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేది. ఈ మండలానికి చెందిన వగ్గెల మిత్రసేన 2009-14 కాలంలో అశ్వారావుపేట ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన జల్లిపల్లి శ్రీరామమూర్తి ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Achuthapuram, Anantharam, Asupaka, Aswaraopeta, Bachuvarigudem, Duradapadu, Gummadivalli, Guntimadugu, Jammigudem, Kannaigudem, Kavadigundla, Khammampadu, Lankaalapalli (D), Maddikonda, Nandipadu, Naramvarigudem, Narayanapuram, Ramannagudem, Tirumalakunta, Vendanthapuram
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అశ్వారావుపేట (Ashwaraopet Mandal): అశ్వారావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. ఇది అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా కూడా ఉంది. 2016 అక్టోబరు11కు మూందు ఈ పట్టణం ఖమ్మం జిల్లాలో ఉండగా జిల్లాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భాగమైంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Aswaraopet Mandal in Telugu, Bhadradri Kothagudem Dist (district) Mandals in telugu, Bhadradri Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి