అశ్వాపురం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 24 గ్రామపంచాయతీలు, 11 రెవెన్యూ గ్రామాలు కలవు. తూర్పు సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మణుగూరు మండలం, తూర్పున దుమ్ముగూడెం మండలం, దక్షిణాన బూర్గుంపహాడ్ మండలం, పశ్చిమాన పాల్వంచ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పు సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 42835. ఇందులో పురుషులు 21635, మహిళలు 21200.
రాజకీయాలు:
ఈ మండలము పినపాక అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన ముత్తినేని సుజాత ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Amerdha, Ammagaripalli, Aswapuram, Chinthiryala, Gondigudem, Kesavapuram, Kummarigudem, Mamillavai, Nellipaka, Pamulapalli, Tummalacheruv
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అమ్మగారిపల్లి (Ammagaripalli): అమ్మగారిపల్లి ఖమ్మం జిల్లా అస్వాపురం మండలానికి చెందిన గ్రామము. ఇది గోదావరి నది సరిహద్దులో ఉంది. పారిశుద్ధ్యం విషయంలో కేంద్రప్రభుత్వం నుంచి నిర్మల్ పురస్కారం పొందింది. 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3076. గ్రామంలో బట్టా మల్లయ్య గుంపు ఎత్తిపోతల పథకం ఉంది. అశ్వాపురం (Ashwapuram): అశ్వాపురం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. ఆశ్వాపురంలో రైల్వేస్టేషన్ ఉంది. పిన్‌కోడ్ 507116. 2016 అక్టోబరుకు ముందు ఖమ్మం జిల్లాలో ఉండగా జిల్లాల పునర్విభజన సమయంలో కొత్తగా ఏర్పడ్న భద్రాద్రి కొత్తగూడెంలో భాగమైంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Ashwapuram Mandal in Telugu, Bhadradri Kothagudem Dist (district) Mandals in telugu, Bhadradri Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి