27, సెప్టెంబర్ 2020, ఆదివారం

జశ్వంత్ సింగ్ (Jaswant Singh)

జననం
జనవరి 3, 1938
రంగం
రాజకీయాలు
పదవులు
9సార్లు ఎంపి, కేంద్రమంత్రి,
మరణం
సెప్టెంబరు 27, 2020
ప్రముఖ రాజకీయ నాయకుడిగా పేరుపొందిన జశ్వంత్ సింగ్ జనవరి 3, 1938న రాజస్థాన్‌లోని జసోల్‌లో జన్మించారు. సైన్యంలో వివిధ హోదాలలో పనిచేసి పదవీవిరమణ పొంది జనసంఘ్ పార్టీ ద్వారా రాజకీయాలలో చేరిన జశ్వంత్ సింగ్ 5 సార్లు రాజ్యసభకు, 4 సార్లు లోక్‌సభకు ఎన్నిక కావడమే కాకుండా వాజపేయి హయంలో రక్షణ, ఆర్థిక, విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, రాజ్యసభలో ప్రతిపక్షనాయకుడిగానూ వ్యవహరించారు. 2012లో ఎన్డీఏ తరఫున ఉప రాష్ట్రపతి పదవికి పోటీచేశారు. 2014ఎన్నికలలో పోటీచేయడానికి సీటు లభించనందున భాజపాకు దూరమైనారు. జశ్వంత్ సింగ్ సెప్టెంబరు 27, 2020న ఢిల్లీలో మరణించారు. కుమారుడు మానవేంద్రసింగ్ కూడా రాజకీయ నాయకుడిగా పేరుపొందారు.

రాజకీయ ప్రస్థానం:
1960లోనే జనసంఘ్ పార్టీ ద్వారా రాజకీయాలలో చేరిన జశ్వంత్ సింగ్ 1980లో అవతరించిన భాజపా వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. 5 సార్లు రాజ్యసభకు (1980, 1986, 1998, 1999, 2004), 4 సార్లు లోక్‌సభకు (1990, 1991, 1996, 2009) ఎన్నికయ్యారు. 1998-99లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, 2004-09 కాలంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. అటల్ బిహారి వాజపేయి హయంలో రక్షణ, ఆర్థిక, విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 1999లో ఉగ్రవాదులు విమానాన్ని కాందహార్‌కు హైజాక్ చేసినప్పుడు ఉగ్రవాదులతో ఈయనే చర్చలు జరిపారు. 2012లో ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీచేసి యుపిఏ అభ్యర్థి హమీద్ అన్సారి చేతిలో ఓడిపోయారు. Jinnah: India-Partition-Independence లో జిన్నాపై సానుభూతి చూపినందుకు పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. 2014లో పార్టీ టికెట్ లభించలేదు, ఇండిపెండెంటుగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత భాజపాకు దూరమైనారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: కేంద్ర ఆర్థికమంత్రులు, రాజస్థాన్ ప్రముఖులు, 2020,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక