యెల్లెందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 16 ఎంపీటీసి స్థానాలు, 29 గ్రామపంచాయతీలు, 7 రెవెన్యూ గ్రామాలు కలవు. మండల పరిధిలో బొగ్గు నిక్షేపాలున్నాయి. సింగరేణి కాలరీస్ లిమిటెడ్‌కు ఎల్లందు జన్మస్థానం. సినీనటి రేష్మారాథోర్ ఈమండలమునకు చెందినది. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో పశ్చిమం వైపున మహబూబాబాదు జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన గుండాల మండలం, తూర్పున టేకులపల్లి మండలం, పశ్చిమాన మహబూబాబాదు జిల్లా, దక్షిణాన ఖమ్మం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 95162. ఇందులో పురుషులు 46510, మహిళలు 48652. పట్టణ జనాభా 34892, గ్రామీణ జనాభా 60270.
రాజకీయాలు:
ఈ మండలము యెల్లందు అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన చీమల నాగరత్నమ్మ ఎన్నికయ్యారు.
యెల్లెందు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Chellasamudram, Komararam, Mamidigundala, Ragaboinagudem, Rompedu, Sudimalla, Yellandu
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
యెల్లెందు (Yellandu): యెల్లెందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది పురపాలక సంఘము మరియు అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రము. సింగరేణి కాలరీస్ లిమిటెడ్‌కు ఎల్లందు జన్మస్థానం. సినీనటి రేష్మారాథోర్ ఈ గ్రామమునకు చెందినది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Yellandu Mandal in Telugu, Bhadradri Kothagudem Dist (district) Mandals in telugu, Bhadradri Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి