దుండిగల్ గండిమైసమ్మ మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ (దూలపల్లిలో) ఈ మండలంలోనే ఉంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అంతకుక్రితం కుత్బుల్లాపూర్ మండలంలో ఉన్న 10 రెవెన్యూ గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదేసమయంలో ఈ మండలం రంగారెడ్డి జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన మేడ్చల్ జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన మరియు తూర్పున మేడ్చల్ మండలం, ఆగ్నేయాన ఆల్వాల్ మండలం, దక్షిణాన కుత్బుల్లాపూర్ మండలం మరియు బాచుపల్లి మండలం, పశ్చిమాన సంగారెడ్డి జిల్లా సరిహద్దుగా ఉంది. రాజకీయాలు: ఈ మండలము కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్గిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. దుండిగల్ గండిమైసమ్మమండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి. మండలంలోని గ్రామాలు:Kompally, Doolapally, Dundigal, Nagaloor, Bowrampet, Gagilapur, Dommara pochampally, Bahadurpally, Shambipur, Mallampet
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు: .దూలపల్లి (Doolapalli): దూలపల్లి రంగారెడ్డి జిల్లా కుతుబుల్లాపూర్ మండలమునకు చెందిన గ్రామము. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ ఈ గ్రామంలోనే ఉంది. దుండిగల్ (Dundigal): దుండిగల్ మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. ఇది పురపాలక సంఘంగా ఉంది. కొంపల్లి (Kompalli): కొంపల్లి మేడ్చల్ జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఉంది. ఇది పురపాలక సంఘంగా ఉంది. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Dundigal gandimaisamma Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి