కాప్రా మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. ఇది పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు GHMCలో భాగంగా ఉంది. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా అవతరించింది. అంతకు క్రితం కీసర, శామీర్‌పేట్, ఘట్‌కేసర్ మండలాలలో ఉన్న ఒక్కో గ్రామాన్ని విడదీసి 3 రెవెన్యూ గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు.. ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) కర్మాగారం, సెంట్రల్ జైలు మండలంలో ఉన్నాయి. మండలం గుండా రైలుమార్గం వెళ్ళుచున్నది. భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ మండలం జిల్లా మధ్యలో ఉంది. ఈ మండలానికి తూర్పున కీసర మండలం, దక్షిణాన మేడిపల్లి మండలం, పశ్చిమాన మల్కాజ్‌గిరి మండలం మరియు ఆల్వాల్ మండలం, ఉత్తరాన షామీర్‌పేట మండలం సరిహద్దులుగా ఉన్నాయి.
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు: .చెర్లపల్లి (Cherlapally) : చెర్లపల్లి మేడ్చల్ జిల్లా కాప్రా మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు GHMCలో భాగంగా కాప్రా సర్కిల్, వార్డు 2లో ఉంది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కర్మాగారం చెర్లపల్లిలో ఉంది. చెర్లపల్లిలో సెంట్రల్ జైలు, రైల్వేస్టేషన్ కూడా ఉన్నాయి. జవహర్‌నగర్ (Cherlapally) : జవహర్‌నగర్ మేడ్చల్ జిల్లా కాప్రా మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు GHMCలో భాగంగా ఉంది. BITS హైదరాబాదు క్యాంపస్ ఈ ప్రాంతంలో ఉంది. కాప్రా (Kapra): కాప్రా మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. ఇది గ్రేటర్ హైదరాబాదులో భాగంగా (వార్డు నెం.1) ఉంది. కీసర మండలంలో ఉన్న ఈ ప్రాంతం 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా మండల కేంద్రంగా మారింది. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kpra Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి