4, అక్టోబర్ 2020, ఆదివారం

మేఘాలయ (Meghalaya)

అవతరణ
జనవరి 21, 1972
రాజధానిషిల్లాంగ్
జిల్లాల సంఖ్య11
అధికార భాష
ఇంగ్లీష్
ఈశాన్య భారత రాష్ట్రమైన మేఘాలయ 1972లో రాష్ట్రంగా అవతరించింది. 22,429 చకిమీ వైశాల్యం, 29.64 లక్షలు (2011 ప్రకారం) జనాభా కల్గిన మేఘాలయ రాష్ట్ర రాజధాని మరియు పెద్ద పట్టణం షిల్లాంగ్.  రాష్ట్రానికి అస్సాం మరియు బంగ్లాదేశ్ సరిహద్దులుగా ఉన్నాయి. వర్షపాతానికి పేరుగాంచిన చిరపుంజి, మౌసిన్రాం, ప్రముఖ కొండలు గారో, ఖాసి, జయంతికలు, నోక్రెస్ బయోస్పియర్ రిజర్వ్  ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రముఖ రచయిత్రి అరుంధతిరాయ్, లోకసభ స్పీకరుగా పనిచేసిన పి.ఏ.సంగ్మా, భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ పదవి చేపట్టిన జె.ఎం.లింగ్డో ఈ రాష్ట్రానికి చెందినవారు. అధికార భాష ఇంగ్లీష్. మేఘాలయాలో 11 జిల్లాలు, 60 శాసనసభ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాలు, ఒక రాజ్యసభ స్థానం ఉంది.
 
భౌగోళికం:
మేఘాలయ ఈశాన్య భారతంలో అస్సాంకు దిగువన బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంది. రాష్ట్రం పేరు మేఘాలయాకు అర్థం మేఘాల నిలయంకు తగ్గట్టుగా దేశంలో వర్షపాతానికి ఈ రాష్ట్రం ప్రసిద్ధి. రాష్ట్ర వైశాల్యం 22,429 చకిమీ కాగా జనాభా 29.64 లక్షలు. వైశాల్యంలో మరియు జనాభాలో ఇది దేశంలో 22వ స్థానంలో ఉంది. గారో, ఖాసీ, జయంతిక కొండలు ఈ రాష్ట్రపు ప్రధాన కొండలు, రాష్ట్ర వైశాల్యంలో సుమారు 70% అడవులు వ్యాపించియున్నాయి. ఇక్కడ వర్షపాతం చాలా అధికం. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతాలైన మౌసిన్రాం, చిరపుంజిలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. జనాభాలో సుమారు 74% క్రైస్తవులు, 11% హిందువులున్నారు.
 
చరిత్ర:
కొత్తరాతియుగం కాలం నుంచే ఇక్కడ ప్రజలు నివశించినట్లు ఆధారాలు లభించాయి. ఆధునిక కాలంలో బ్రిటీష్ పాలన వచ్చే వరకు గారో, ఖాసీ, జయంతితా తెగలు స్వంత పాలన అధికారం కల్గియున్నారు. 1835లో ఇది అస్సాంలో భాగమైంది. 1905లో బెంగాల్ విభజన సమయంలో కొత్తగా ఏర్పడిన తూర్పు బెంగాల్ ప్రావిన్సులో చేరి బెంగాల్ విభజన రద్దు తర్వాత మళ్ళీ అస్సాం ప్రావిన్సులో భాగమైంది. స్వాతంత్ర్యానంతరం అస్సాం రాష్ట్రంలో భాగంగా మారి ఆ తర్వాత ప్రత్యేక ప్రతిపత్తి న్న ఉప రాష్ట్రంగా, 1972లో 22వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది.

 
ఆర్థికం:
మేఘాలయాలో ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. రాష్ట్రం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి. వ్యవసాయం ఎక్కువగా ఝమ్‌ (షిఫ్టింగ్) పద్దతిలో సాగుతుంది. అనగా సారం తగ్గిన తర్వాత మరోచోటికి వలస వెళ్తారు. 
 
 
ఇవి కూడా చూడండి:
  • భారతదేశ రాష్ట్రాలు,
  • మేఘాలయ ప్రముఖులు,
  • మేఘాలయ ముఖ్యమంత్రులు,
  • మేఘాలయ గవర్నర్లు,
  • మేఘాలయ జిల్లాలు,
  • మేఘాలయ కాలరేఖ,




హోం
విభాగాలు: భారతదేశ రాష్ట్రాలు, మేఘాలయ,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక