17, డిసెంబర్ 2020, గురువారం

మధురాంతకం రాజారాం (Madhurantakam Rajaram)

మధురాంతకం రాజారాం
జననం
అక్టోబరు 5, 1930
రంగం
కథా రచయిత
పురస్కారాలు
కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు
మరణం
ఏప్రిల్ 1, 1999
ప్రముఖ కథా రచయితగా పేరుపొందిన మధురాంతకం రాజారాం అక్టోబరు 5, 1930చిత్తూరు జిల్లా పాకాల మండలం మొగరాల/దామల్‌చెరువులో జన్మించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడుగా పనిచేసిన రాజారాం తన జీవితంలో 400కు పైగా కథలు, 2 నవలలు రచించారు. ఈయన కుమారులు మధురాంతకం నరేంద్ర, మధురాంతకం మహేంద్రలు కూడా రచయితలుగా పేరుపొందారు. ఈయన కథా రచనలు పలు భాషలలో అనువాదం అయ్యాయి. చిన్ని ప్రపంచం-సిరివాడ నవల రష్యన్ భాషలోకి అనువాదం చేయబడింది. ఈయన ముఖ్యమైన రచన "మధురాంతకం రాజారాం కథలు". మధురాంతకం జీవితం ఆధారంగా సింగమనేని నారాయణ పుస్తకం రాశారు (2013లో ఈ పుస్తకానికి సాహిత్య అకాడమి అవార్డు లభించింది). రాజారాం ఏప్రిల్ 1, 1999న తిరుపతిలో మరణించారు.

పురస్కారాలు:
1968లో ఉత్తమ కథకుడిగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు పొందారు (తాను వెలిగించిన దిపాలు రచన). 1993లో మధురాంతకం రాజారాం కథలు పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది. 1991లో గోపీచంద్ సాహితీ సన్మానం పొందారు. 1994లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంచే గౌరవ డాక్టరేట్ పొందారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: ప్రముఖ తెలుగు సాహితీవేత్తలు, చిత్తూరు జిల్లా ప్రముఖులు, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీతలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక