మారేడ్‌పల్లి హైదరాబాదు జిల్లాకు చెందిన మండలము. బేగంపేట-బీబీనగర్ రైలుమార్గం మండలం మీదుగా వెళుచున్నది. ఈ మండలం సికింద్రాబాదు రెవెన్యూ డివిజన్‌లో భాగంగా ఉంది. మండలంలోని లాలాగూడ మీదుగా ఎమెంటీఎస్, తార్నాక మీదుగా మెట్రోరైల్వే మార్గాలు వెళ్ళుచున్నాయి. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటి ఈ మండలంలోనే ఉంది. భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలం హైదరాబాదులో ఈశాన్యాన మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా సరిహద్దులో ఉంది. దక్షిణాన ముషీరాబాదు మండలం, వాయువ్యాన తిరుమలగిరి మండలం, పశ్చిమాన సికింద్రాబాదు మండలం మిగితావైపులా మేడ్చల్ జిల్లా సరిహద్దుగా ఉంది. రాజకీయాలు: ఈ మండలము ముషీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, సికింద్రాబాదులోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. హైదరాబాదు మహానగర పాలక సంస్థలో తార్నాకా 143 డివిజన్‌లో, మెట్టుగూడ 144 డివిజన్‌లో, సీతాఫల్‌మండి 145 డివిజన్‌లో భాగంగా ఉన్నాయి. 2020 ఎన్నికలలో ఈ డివిజన్లను తెరాస గెలుచుకుంది. మారేడ్‌పల్లి మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:మారేడ్‌పల్లి (సర్ఫేఖాస్), మారేడ్ పల్లి (పైగహ్), లాలాగూడ, మల్కాజ్‌గిరి(కంటోన్మెంట్) మండల పరిధిలోని ముఖ్యమైన ప్రాంతాలు:
తార్నాక,లాలగూడ, శేషాచల కాలని, మెట్టుగూడ, లాలాపేట, బెస్ట్ మారేడుపల్లి, మహేంద్రహిల్స్, తుకారాంగేట్, మైలార్‌గడ్డ, సీతాఫల్‌మండి, చిలకలగూడ, ఆర్యనగర్, సాయినగర్, త్రిమూర్తి కాలని,
మండలంలోని ప్రముఖ ప్రాంతాలు: సీతాఫల్ మండి (Seethaphalmandi):సీతాఫల్‌మండి మారేడ్‌పల్లి మండలమునకు చెందిన ప్రాంతము. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమీపంలో ఉంది. సీతాఫల్‌మండిలో రైల్వేస్టేషన్ కూడా ఉంది. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటి ఈ ప్రాంతంలోనే ఉంది. లాలగూడ (Lalaguda): లాలగూడ మారేడ్‌పల్లి మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. లాలగూడలో మన్మాడ్ వెళ్ళు మార్గంలో రైల్వేస్టేషన్ ఉంది.రైల్వే ఉద్యోగులకు సంబంధించిన పెద్ద ఆసుపత్రి కూడా లాలగూడలో ఉంది. అంతేకాకుండా రైల్వేవాగన్ల రిపేరుషాప్ కూడా ఈ ప్రాంతంలో ఉంది. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Nampally Mandal in Telugu, Hyderabad Dist (district) Mandals in telugu, Hyderabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి