9, డిసెంబర్ 2020, బుధవారం

సునీత ఉపద్రష్ట (Sunitha Upadrashta)

జననం
మే 10, 1978
రంగం
గాయని
పురస్కారాలు
2 ఫిలింఫేర్, 8 నంది అవార్డులు


గాయనిగా, యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, నటిగా పేరుపొందిన సునీత ఉపద్రష్ట మే 10, 1978న విజయవాడలో జన్మించింది. (పెరిగింది గుంటూరులో). చిన్న వయస్సులోనే గాయనిగా పేరుతెచ్చుకున్న సునీత 1995లో గులాబి సినిమా ద్వారా గాయనిగా ప్రస్థానం ఆరంభించి వందలాది సినీ పాటలు పాడడమే కాకుండా 500 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది. 2 సార్లు ఫిలింఫేర్ అవార్డులు, 8 సార్లు నంది అవార్డులే కాకుండా పలు ఇతర పురస్కారాలు పొందింది. 19 సం.ల వయస్సులో కిరణ్ కుమార్ గోపరాజుతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. తర్వాత వీరు విడాకులు పొందారు. పారిశ్రామికవేత్త రామ్‌ వీరపనేనినితో మళ్ళీ వివాహం చేసుకుంటోంది.

సినీ ప్రస్థానం, గుర్తింపులు:
1995లో సునీత పాడిన తొలి పాట "ఏ వేళలో నీవు ...", ఈ పాట గులాబి సినిమాలోనిది, పాట రచయిత సిరివెన్నల సీతారామశాస్త్రి. చిన్న వయస్సులోనే సునీత లైట్ మ్యూజిక్ కేటగేరిలో ఆలిండియా రేడియో నుంచి జాతీయ పురస్కారం పొందింది. తన సినీ జీవితంలో ఉత్తమ గాయనిగా 2 సార్లు ఫిలింఫేర్ అవార్డులు (తెలుగు, కన్నడ), 9 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డులు స్వీకరించింది. 2011లో ఉత్తమ గాయనిగా లతామంగేష్కర్ అవార్డు పొందింది.

టెలివిజన్ షో:
సునీత గాయనిగానే కాకుండా టీవి యాంకర్‌గా, వ్యాఖ్యతగా కూడా రాణిస్తోంది. 1995 నుంచి ఇప్పటివరకు పలు టెలివిజన్ ఛానెళ్ళలో (దూరదర్శన్, జెమిని టీవి, ఈటీవి, మా టీవి, ఎస్వీబీసి తదితరాలలో) పనిచేసింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఈటీవిలో స్వరాభిషేకం ప్రోగ్రాంలో గాయనిగా మరియు యాంకర్‌గా వ్యవహరిస్తోంది. భక్తిగీతాలు పాడడంలో కూడా మంచి పేరుతెచ్చుకుంది.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: తెలుగు సినిమా గాయకులు, తెలుగు సినిమా నటీమణులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక