22, జనవరి 2013, మంగళవారం

కోస్గి మండలము (Kosgi Mandal)

జిల్లా నారాయణపేట
రెవెన్యూ డివిజన్నారాయణపేట
జనాభా52313 (2001)
57418 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంకోడంగల్
లోకసభ నియోజకవర్గంమహబూబ్ నగర్
ముఖ్య పంటలుకందులు
మండల ప్రముఖులుగుండుమాల్ గోపాలరావు,
కోస్గి నారాయణపేట జిల్లాకు చెందిన మండలము. ఇది నారాయణపేట రెవెన్యూ డివిజన్, కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మహబూబ్ నగర్ నుంచి రంగారెడ్డి జిల్లా తాండూరు వెళ్ళు ప్రధాన రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. మండలంలో 24 రెవెన్యూ గ్రామాలు, 24 గ్రామపంచాయతీలున్నాయి. విమోచనోద్యమకారుడు గుండుమాల్ గోపాలరావు ఈ మండలమునకు చెందినవారు. కోస్గి మరియు గుండుమల్ మండలంలోని పెద్ద గ్రామాలు. మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటి ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న ఈ మండలం కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో కలిసింది.

మండల సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున బొంరాస్ పేట మండలము, దక్షిణమున మద్దూరు మండలము, పశ్చిమాన కోస్గి, దౌల్తాబాదు మండలములు, తూర్పున రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా

2001 లెక్కల ప్రకారం మండల జనాభా 52313. ఇందులో పురుషులు 26053, మహిళలు 26260.
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 57418. ఇందులో పురుషులు 28575, మహిళలు 28843. అక్షరాస్యుల సంఖ్య 27400.

రవాణా సౌకర్యాలు:
మహబూబ్ నగర్ నుంచి రంగారెడ్డి జిల్లా తాండూరు వెళ్ళు ప్రధాన రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. ప్రతిపాదనలో ఉన్న కృష్ణా - వికారాబాదు రైలుమార్గం మండలం గుండా వెళ్తుంది. ఉత్తరాన సరిహద్దుగా ఉన్న కోడంగల్, బొంరాస్ పేట మండలాల గుండా హైదరాబాదు- బీజాపుర్ రాష్ట్ర రహదారి పోతుంది. కోస్గి నుంచి నారాయణపేట వెళ్ళు రహదారి గుండుమాల్ మీదుగా వెళుతుంది.

రాజకీయాలు:
ఈ మండలం కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2001 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన హన్మంతరెడ్డి, 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్.వెంకటమ్మ విజయం సాధించారు. 2014లో ఎంపీపీగా తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతాప్‌రెడ్డి ఎన్నికయ్యారు.

కోడంగల్ నియోజకవర్గంలో
కోస్గి మండల స్థానం (వంకాయ రంగు)
వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 16796 హెక్టార్లలో 62% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట కందులు. వరి, కూరగాయలు, వేరుశనగా కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 590 మిమీ. మండలంలో సుమారు 3500 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 52 ప్రాథమిక పాఠశాలలు (45 మండల పరిషత్తు, 1 ప్రవేట్ ఎయిడెడ్, 6 పైవేటు అన్-ఎయిడెడ్), 10 ప్రాథమికోన్నత పాఠశాలలు (6 మండల పరిషత్తు, 4 ప్రైవేట్), 15 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 8 జడ్పీ, 6 ప్రైవేట్) పాఠశాలలు, 4 జూనియర్ కళాశాలలు (1 ప్రభుత్వ, 3 ప్రైవేట్) ఉన్నాయి.

కాలరేఖ:
  • స్వాతంత్ర్య సమరయోధుడు గుండుమాల్ గోపాలరావు భారత ప్రభుత్వంచే తామ్రపత్రం పొందారు.
  • 2005 ఆగస్టు 17: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఉల్ఫోవిజ్ కోస్గి సందర్శించారు.

కోస్గి మండలంలోని గ్రామపంచాయతీలు
 


ఇవి కూడా చూడండి:

  •  
హోం,
విభాగాలు:
నారాయణపేట జిల్లా మండలాలు,  కోస్గి మండలము, నారాయణపేట రెవెన్యూ డివిజన్, కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం
= = = = =  
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  •  మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • https://narayanpet.telangana.gov.in/ (Narayanapet Dist official website)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక