పెద్దమందడి వనపర్తి జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము వనపర్తి రెవెన్యూ డివిజన్, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 13 రెవెన్యూ గ్రామాలు, 22 గ్రామపంచాయతీలు కలవు. 2012 జూన్‌లో ప్రకటించిన 20 సుత్రాల అమలులో పెద్దమందడి మండలంలో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ కవి వెంకటకృష్ణకవి ఈ మండలమునకు చెందినవారు. మండల విస్తీర్ణం 180.15 చకిమీ (17512 హెక్టార్లు). మండల సాధారణ వర్షపాతము 601 సెంమీ. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 40345.
భౌగోళికం, సరిహద్దులు: పెద్దమందడి మండలం జిల్లాలో భౌగోళికంగా మధ్యలో ఉంది. మండల కేంద్రం 16 డి 25"1' అక్షాంశ రేఖ, 78 డి 2"6' రేఖాంశంపై ఉంది. మండల విస్తీర్ణం 17512 హెక్టార్లు. ఇందులో 403 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. ఈ మండలమునకు ఉత్తరమున అడ్డాకల్, ఘనపురం మండలాలు, తూర్పున మరియు దక్షిణమున వనపర్తి మండలము, పశ్చిమాన కొత్తకోట, దేవరకద్ర మండలములు సరిహద్దులుగా ఉన్నాయి జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 31635. ఇందులోపురుషులు 15970, మహిళలు 15665. ఎస్సీల సంఖ్య 5379, ఎస్టీల సంఖ్య 2617. 2001 జనాభా లెక్కల మండల కోడ్ 0046. జనసాంద్రత 176/చకిమీ. స్త్రీ, పురుష నిష్పత్తి 933. మండలం మొత్తం గ్రామీణ ప్రాంతమే. అక్షరాస్యత శాతం 42.57%. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 40345. ఇందులో పురుషులు 20443, మహిళలు 19902. జనాభాలో ఇది జిల్లాలో 60వ స్థానంలో ఉంది. రవాణా సౌకర్యాలు: 44వ నెంబరు జాతీయ రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. అయిననూ మండలంలో ఈ రహదారిపై ప్రధాన పట్టణాలు లేవు. మండలకేంద్రం జాతీయ రహదారికి లోపల ఉన్నది. కొత్తకోట, వనపర్తిల నుంచి మండల కేంద్రానికి రహదారి సౌకర్యం ఉంది.
ఈ మండలము వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వెంకటస్వామి ఎన్నికయ్యారు. 2006 సర్పంచి ఎన్నికలలో మండలంలోని 16 గ్రామపంచాయతీలకుగాను తెలుగుదేశం పార్టీ 9, కాంగ్రెస్ పార్టీ 7 పంచాయతీలలో విజయం సాధించాయి. విద్యాసంస్థలు: 2008-09 నాటికి మండలంలో 27 ప్రాథమిక పాఠశాలలు (25 మండల పరిషత్తు, 1 ప్రైవేట్), 14 ప్రాథమికోన్నత పాఠశాలలు (12 మండల పరిషత్తు, 2 ప్రైవేట్), 6 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 5 జడ్పీ), ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది. వ్యవసాయం, నీటిపారుదల: మండలం మొత్తం విస్తీర్ణం 17512 హెక్టార్లలో 29% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట వరి. మొకజొన్న, కందులు, జొన్నలు, వేరుశనగ, కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 601 మిమీ. మండలంలో సుమారు 1800 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.
|
24, జనవరి 2013, గురువారం
పెద్దమందడి మండలము (Peddamandadi Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి