24, జనవరి 2013, గురువారం

వనపర్తి మండలము (Wanaparthy Mandal)

జిల్లా వనపర్తి
రెవెన్యూ డివిజన్ వనపర్తి
జనాభా88104 (2001)
108748 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంవనపర్తి
లోకసభ నియోజకవర్గంనాగర్ కర్నూల్
ముఖ్య పంటలుమొక్కజొన్న
మండల ప్రముఖులుకప్పగంతుల లక్ష్మణశాస్త్రి
వనపర్తి వనపర్తి జిల్లాకు చెందిన మండలము. జిల్లాలో ఉన్న ఏకైక విత్తన శుద్ధి కర్మాగారం మండలంలోని నాగవరంలో ఉంది. రాజాపేట్ వద్ద ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుచేస్తున్నారు. వనపర్తికి చెందిన రాజా రామేశ్వర్ వనపర్తి సంస్థానం రాజుగా, 5 సార్లు లోకసభ సభ్యుడిగా పనిచేశారు. ఈ మండలము వనపర్తి రెవెన్యూ డివిజన్, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 108748. మండలంలో ఒక పురపాలక సంఘము, 11 ఎంపీటీసి స్థానాలు, 26 రెవెన్యూ గ్రామాలు, 21 గ్రామపంచాయతీలు కలవు. రాష్ట్రంలో తొలి పాలిటెక్నిక్ కళాశాల వనపర్తిలో స్థాపించబడింది. కవి కప్పగంతుల లక్ష్మణశాస్త్రి ఈ మండలమునకు చెందినవారు.

సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున పెద్దమందడి, ఘనపూర్ మండలములు, తూర్పున గోపాలపేట, పానగల్ మండలములు, దక్షిణాన పానగల్, పెబ్బేరు మండలములు, పశ్చిమాన కొత్తకోట మండలము సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 88104. ఇందులో పురుషులు 45042, మహిళలు 43062.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 108748. ఇందులో పురుషులు 55427, మహిళలు 53321. పట్టణ జనాభా 61170, గ్రామీణ జనాభా 47578. జనాభాలో ఇది జిల్లాలో 4వ స్థానంలో ఉంది. అక్షరాస్యత శాతం 68.06%. ఇది జిల్లాలో అత్యధిక అక్షరాస్యత శాతం కల మండలాలలో మూడవ స్థానంలో ఉంది.

వనపర్తి నియోజకవర్గంలో
వనపర్తి మండల స్థానం (పసుపు రంగు)
రవాణా సౌకర్యాలు:
జాతీయ రహదారి సమీపంలో ఉండుట, వనపర్తి పెద్ద పట్టణం కావడంచే రవాణా సౌకర్యాలు బాగుగా ఉన్నాయి. వనపర్తిలో ఆర్టీసి బస్సు డిపో ఉన్నది.మహబూబ్ నగర్, హైదరాబాదు వెళ్ళు వాహనాలు కొత్తకోట వద్ద జాతీయరహదారిని కలుస్తాయి. వనపర్తి నుంచి గోపాలపేట మీదుగా నాగర్ కర్నూలుకు రహదారి ఉంది. అలాగే వనపర్తి నుంచి పెబ్బేరు, పెద్దమందడిలకు కూడా రోడ్డుసౌకర్యం ఉంది. మండలానికి రైల్వేలైన్ లేకున్ననూ వనపర్తి రోడ్ పేరిట కొత్తకోట మండలం మదనాంతపూర్ లో రైల్వేస్టేషన్ ఉంది.

రాజకీయాలు:
ఈ మండలము వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన ధర్మా ఎన్నికయ్యారు. 2006 సర్పంచి ఎన్నికలలో మండలంలోని 19 గ్రామపంచాయతీలకుగాను తెలుగుదేశం పార్టీ 12, కాంగ్రెస్ పార్టీ 7 పంచాయతీలలో విజయం సాధించాయి.

విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 94 ప్రాథమిక పాఠశాలలు (2 ప్రభుత్వ, 63 మండల పరిషత్తు, 29 ప్రైవేట్), 22 ప్రాథమికోన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 10 మండల పరిషత్తు, 11 ప్రైవేట్), 41 ఉన్నత పాఠశాలలు (3 ప్రభుత్వ, 9 జడ్పీ, 1 ప్రైవేట్ ఎయిడెడ్, 28 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 16 జూనియర్ కళాశాలలు (3 ప్రభుత్వ, 13 ప్రైవేట్) ఉన్నవి.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 20172 హెక్టార్లలో 27% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. 19% భూభాగంలో అడవులున్నాయి. మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న. వరి, జొన్నలు, వేరుశనగ కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 685 మిమీ. మండలంలో సుమారు 2400 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది. 

హోం,
విభాగాలు:
వనపర్తి జిల్లా మండలాలు,  వనపర్తి మండలము, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర (రచన- ఆచార్య ఎస్వీ రామారావు),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక