అడ్డాకల్ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మండలము. 44వ నెంబరు జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. ఈ మండలము మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గము, మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గములో భాగము. మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు, 20 గ్రామపంచాయతీలు కలవు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 52346. కందూరులో శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది.2014 శాసనసభ ఎన్నికలలో మహబూబ్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వి.శ్రీనివాస్ గౌడ్ ఈ మండలమునకు చెందినవారు.
మండల సరిహద్దులు:
అడ్డాకల్ మండలమునకు తూర్పున ఘన్‌పూర్, దక్షిణమున పెద్దమందడి, పశ్చిమాన దేవరకద్ర, ఉత్తరమున భూత్పూర్ మండలములు సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 46380. ఇందులో పురుషులు 23596, మహిళలు 22784. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 52346. ఇందులో పురుషులు 26491, మహిళలు 25855. జనాభాలో ఇది జిల్లాలో 40వ స్థానంలో ఉన్నది. చరిత్ర: కందూరు చోడుల కాలంలో రాజధానిగా పనిచేసిన కందూరు ప్రస్తుతం ఈ మండలంలోనే ఉంది. విశాలమైన కందూరు చోడరాజ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మరియు ఉమ్మడి నల్గొండ జిల్లాలు భాగంగా ఉండేవి. రాజధానిని వర్థమాన పురానికి మారిన తర్వాత వంశనామం కందూరు చోడులుగానే పిల్వబడింది. కాకతీయ గణపతిదేవుని కాలంలో వర్థమానపురంపైకి దండెత్తిన కాకతీయ సైన్యాలు రాజధానిని నాశనం చేయడంతో కందూరు చోడరాజ్యం కాకతీయ సామ్రాజ్యంలో భాగమైంది. ఆ తర్వాత ఈ ప్రాంతం పలు రాజవంశాల చేతులుమారి కుతుభ్‌షాహీలు, నిజాంల పాలనలో కొనసాగి చివరికి సెప్టెంబరు 17, 1948న భారత యూనియన్‌లో విలీనమైంది. 1948-56 కాలంలో హైదరాబాదు రాష్ట్రంలో, 1956-2014 కాలంలొ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగి జూన్ 2, 2014న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో భాగమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పుడు 1969లో మరియు 2009-14 కాలంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. 2011లో సకల జనుల సమ్మె ఈ మండలంలో పుర్తిగా జయప్రదమైంది. 42 రోజులపాటు విద్యాసంస్థలు, కార్యాలయాలు మూతపడ్డాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, కార్మికులు, మహిళలు తదితరులందరూ తెలంగాన ఉద్యమంలో పాల్గొన్నారు. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో మండలం రెండు ముక్కలై కొత్తగా మూసాపేట మండలం ఏర్పడింది. రవాణా సౌకర్యాలు: 44వ నెంబరు జాతీయ రహదారి మండల గుండా వెళ్ళుచున్నది. మండలానికి రైలుసౌకర్యం లేదు కాని పశ్చిమ సరిహద్దుగా ఉన్న దేవరకద్ర మండలం నుంచి రైల్వేలైన్ వెళ్ళుచున్నది.
ఈ మండలము దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2008 నియోజకవర్గాల పునర్విభజనకు పూర్వం ఈ మండలము వనపర్తి, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలలో ఉండేది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బాల నర్సిములు ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు: 2008-09 నాటికి మండలంలో 36 ప్రాథమిక పాఠశాలలు (33 మండల పరిషత్తు, 3 ప్రైవేట్), 10 ప్రాథమికోన్నత పాఠశాలలు (7 మండల పరిషత్తు, 3 ప్రైవేట్), 14 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 11 జడ్పీ, 2 ప్రైవేట్), 1 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉన్నది. వ్యవసాయం, నీటిపారుదల: మండలం మొత్తం విస్తీర్ణం 20518 హెక్టార్లలో 20% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట వరి. వేరుశనగ, మిగితా పంటలు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 623 మిమీ. మండలంలో సుమారు 2500 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది
= = = = = సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
22, జనవరి 2013, మంగళవారం
అడ్డాకల్ మండలం (Addakal Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
hats off author...
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు
తొలగించండి