ఆలంపూర్ జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలము. బాదామి చాళుక్యుల కాలం నాటి ప్రాచీన దేవాలయాలకు నిలయమైన ఆలంపూర్ దేశంలోని 18 శక్తిపీఠాలలో ఒకటి. ఇది జిల్లా దక్షిణ సరిహద్దులో తుంగభద్ర నది తీరాన ఉన్నది. మండలంలోని సుల్తాన్‌పూర్, ర్యాలంపాడు, జిల్లెడుపాడు గ్రామాలు తుంగభద్రకు ఆవలివైపున ఉన్నాయి. సికింద్రాబాదు- ద్రోణాచలం రైలుమార్గం, 44వ నెంబరు జాతీయ రహదారి మండలం సమీపం నుంచి వెళ్ళుచున్నాయి. ఈ మండలం గద్వాల రెవెన్యూ డివిజన్, ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గము, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గములో భాగము. మండల కేంద్రంలో క్రీ.శ.6వ శతాబ్దిలో బాదామి చాళుక్య రెండో పులకేశి కాలంలో నిర్మించిన ఆలయాలున్నాయి. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన జోగుళాంబ ఆలయం ఉంది. గొందిమల్ల, ర్యాలంపాడు గుట్టలపై యురేనియం, బంగారం, వజ్రాల కోసం అన్వేషణ జరిగింది. సాహితీవేత్త గడియారం రామకృష్ణశర్మ, ప్రముఖ రాజకీయ నాయకురాలు తేళ్ల లక్ష్మీకాంతమ్మ, రాజకీయ నేత నాగన్న ఈ మండలమునకు చెందినవారు.
శ్రీశైలంప్రాజెక్టు నిర్మాణం వల్ల అలంపూర్ మండలంలోని అలంపూర్, మారమునగాల, ప్రాగటూర్, శేరుపల్లి, క్యాతూరు, భీమవరం, కూడవల్లి, ర్యాలంపాడు, సుల్తానాపురం, జిల్లెడుబండ గ్రామాలతో పాటు పొలాలు ముంపుకు గురయ్యాయి. మండల సరిహద్దులు: ఆలంపుర్ మండలమునకు పశ్చిమాన మానొపాడ్ మండలం సరిహద్దుగా ఉండగా, ఉత్తరం మరియు ఈశాన్యాన కృష్ణానది, దక్షిణం మరియు ఆగ్నేయాన తుంగభద్ర నది, కర్నూలు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: 44వ నెంబరు జాతీయ రహదారి మండలం సమీపం నుంచి వెళ్ళుచున్నది. ఆలంపూర్ చౌరస్తాగా పిలువబడే కూడలి మానోపాడ్ మండలం ఉండవెల్లిలో ఉంది. సికింద్రాబాదు నుండి ద్రోణాచలం వెళ్ళే రైలుమార్గం కూడా మండలం సమీపం నుంచి వెళ్ళుచున్నది. ఆలంపూర్ రోడ్ పేరుతో స్టేషన్ ఇదివరకే ఉండగా, తుంగభద్ర పుష్కరాల సందర్భం నుంచి జోగులాంబ హాల్ట్ వద్ద కూడా రైళ్ళను నిలుపుచేస్తున్నారు.
ఆలంపూర్ మండలము ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూలు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ప్రముఖ రాజకీయ నాయకురాలు, ఖమ్మం నుంచి 3 సార్లు లోక్6సభకు ఎన్నికైన తేళ్ల లక్ష్మీకాంతమ్మ ఈ మండలమునకు చెందినవారు. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సరస్వతి విజయం సాధించారు. 2014లో ఆలంపూర్ ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన షంషాద్ బేగం ఎన్నికయ్యారు. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 41224. ఇందులో పురుషులు 20972, మహిళలు 20252. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 44961. ఇందులో పురుషులు 23285, మహిళలు 21676. గ్రామీణ అక్షరాస్యతలో ఆలంపూర్ మండలం జిల్లాలోనే ప్రథమస్థానంలో నిలిచింది. జనాభాలో ఇది జిల్లాలో 56వ స్థానంలో ఉంది. చరిత్ర: బాదామి చాళుక్యుల కాలంలో మండల కేంద్రం వైభవంగా వెలుగొందినది. వారికాలంలో నిర్మించిన చారిత్రక దేవాలయాలు నేటికీ దర్శనమిస్తున్నాయి. ఆలంపూర్ పరిసర ప్రాంతాలు కూడా చారిత్రక ప్రాంతాలే.
విద్యాసంస్థలు: 2008-09 నాటికి మండలంలో 25 ప్రాథమిక పాఠశాలలు (24 మండల పరిషత్తు, 1 ప్రైవేట్), 10 ప్రాథమికోన్నత పాఠశాలలు (8 మండల పరిషత్తు, 2 ప్రైవేట్), 12 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 8 జడ్పీ, 3 ప్రైవేట్), 2 జూనియర్ కళాశాలలు (1 ప్రభుత్వ, 1 ప్రైవేట్) ఉన్నవి. వ్యవసాయం, నీటిపారుదల: మండలం మొత్తం విస్తీర్ణం 27344 హెక్టార్లలో 49% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న. వేరుశనగ, ఇతర పంటలు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 588 మిమీ. మండలంలో సుమారు 1300 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
22, జనవరి 2013, మంగళవారం
ఆలంపూర్ మండలం (Alampur Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి