కొండా సురేఖ వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు. ఈమె ఆగస్టు 19, 1965న హన్మకొండలో జన్మించారు. మండల అధ్యక్షురాలిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించి శాయంపేట నుంచి 2 సార్లు, పరకాల నుంచి ఒకసారి, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఒకసారి శాసనసభకు ఎన్నిక కావడమే కాకుండా వైఎస్సార్ మంత్రివర్గంలో స్థానం కూడా పొందారు.
రాజకీయ ప్రస్థానం: కొండా సురేఖ 1995లో గీసుకొండ మండల అధ్యక్షురాలిగా ఎన్నికైనారు. 1996లో పిసిసి సభ్యులుగా నియమించబడి, 1999లో శాయంపేట నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు. 2000లో ఏసిసిసి సభ్యులయ్యారు. 2004లో కూడా శాయంపేట నుంచి మరోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో పరకాల నుంచి పోటీచేసి శాసనసభకు మూడవ సారి విజయం సాధించారు. వైఎస్సార్ మంత్రివర్గంలో స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రిపదవిని పొందారు. వైఎస్సార్ మరణానంతరం ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని వాదించి జగన్ పక్షాన నిలిచి మంత్రిపదవికి రాజీనామా చేశారు. కిరణ్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ విప్‌ను ఉల్లంఘించి శాసనసభ్యత్వాన్ని కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన పరకాల ఉప ఎన్నికలలో వైకాపా తరఫున పోటీచేసి పరాజయం పొందారు. మారిన పరిస్థితుల కారణంగా ఒకప్పుడు జగన్‌కు బాసటగా నిలిచిన కొండా సురేఖ ఆమె భర్త కొండా మురళి దంపతులు జగన్‌పై విమర్శలు కురిపించి జూలై 30, 2013న వైఎస్సార్ సీపికి రాజీనామా చేసి సెప్టెంబరు 4, 2013న కాంగ్రెస్ పార్టీలో చేరి, మార్చి 18, 2014న తెరాసలో ప్రవేశించారు. 2014 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత తెరాసకు కూడా రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరి 2018 ఎన్నికలలో కాంగ్ర్స్ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. కుటుంబం: కొండా సురేఖ భర్త కొండా మురళి కూడా రాజకీయ నాయకులుగా ప్రసిద్ధులు. ఇతను ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇవి కూడా చూడండి:
(ఈ సమాచారం 10-05-2020 నాటికి తాజాకరించబడింది)
= = = = =
|
30, జులై 2013, మంగళవారం
కొండా సురేఖ (Konda Surekha)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి