గీసుకొండ వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 21 గ్రామపంచాయతీలు, 16 రెవెన్యూ గ్రామాలు కలవు. కాజీపేట నుంచి విజయవాడ వెళు రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నది. రాజకీయ నాయకులు కొండా సురేఖ, కొండా మురళీ ఈ మండలమునకు చెందినవారు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో వరంగల్ గ్రామీణ జిల్లాలో భాగంగా మారింది.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలం వరంగల్ గ్రామీణ జిల్లాలో పశ్చిమం వైపున వరంగల్ పట్టణ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన దామెర మండలం మరియు ఆత్మకూరు మండలం, తూర్పున దుగ్గొండి మండలం, దక్షిణాన సంగెం మండలం, పశ్చిమాన వరంగల్ పట్టణ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 63937. ఇందులో పురుషులు 31926, మహిళలు 32011. మండలంలో పట్టణ జనాభా 24636, గ్రామీణ జనాభా 39301.
రాజకీయాలు:
ఈ మండలము పరకాల అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగము. రాష్ట్రమంత్రిగా పనిచేసిన కొండా సురేఖ 1995లో ఈ మండల అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 2008లో పునర్విభజనకు ముందు శాయంపేట నియోజకవర్గంలో ఉండేది. రాజకీయ నాయకులు కొండా సురేఖ, కొండా మురళీ ఈ మండలమునకు చెందినవారు. 2019లో మండల అధ్యక్షులుగా క్ంగ్రెస్ పార్టీకి చెందిన బీమగాని సౌజన్య, జడ్పీటీసి ఎన్నికలలో తెరాసకు చెందిన పోలీస్ ధర్మారావు ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Anantharam, Bodduchintalapalli, Dharmaram, Elkurthy, Geesugonda, Gorrekunta, Kommala, Machapur, Manugonda, Mogilicherla, Ookal (H), Potharajpalli, Ramachandrapur, Shayampet, Vanchangiri, Viswanathpur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
గంగదేవిపల్లి (Gangadevipalli): గంగదేవిపల్లి వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలమునకు చెందిన గ్రామము. 2007లో దేశంలో ఉత్తమ గ్రామపంచాయతీలకిచ్చే "రాజీవ్ గాంధీ అత్యుత్తమ గ్రామపంచాయతి పురస్కారం"కు ఈ గ్రామం ఎంపికైంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక ఆదర్శ గ్రామంగా నిలిచింది. దేశవిదేశాల నుంచి గ్రామాన్ని అధ్యయనం చేయడానికి పరిశోధకులు వచ్చారు. 1994లో మాచాపూర్ నుంచి విడీపోయి ప్రత్యేక పంచాయతీగా మారిన తర్వాత అభివృద్ధిపథంలోకి వెళ్ళింది. గొర్రెకుంట (Gorrekunta): గొర్రెకుంట వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలమునకు చెందిన గ్రామము. గొర్లకుంట శివారులో పాడుబడిన బావిలో 9 మంది మృతదేహాలు బయటపడిన సంఘటన మే 2020లో సంచనలం సృష్టించింది.
వంచనగిరి (Vanchanagiri):
వంచనగిరి వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలమునకు చెందిన గ్రామము. ఎమ్మెల్సీగా పనిచేసిన కొండా మురళి, రాష్ట్రమంత్రిగా పనిచేసిన కొండా సురేఖ ఈ గ్రామానికి చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Geesukonda Mandal in Telugu, Warangal Rural Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి