ఆలేరు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. ప్రముఖ జైనక్షేత్రం కొలనుపాక ఈ మండలంలోఉంది. సికింద్రాబాదు-కాజీపేట రైలుమార్గం మండలం గుండా వెళుతుంది. ఆలేరులో రైల్వేస్టేషన్ ఉంది. మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు కలవు. సమరయోధుడు, జడ్పీ చైర్మెన్‌గా పనిచేసిన ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి నర్సింహులు, ఆసు యంత్రం ఆవిష్కర్త చింతకింది మల్లేశం ఈ మండలమునకు చెందినవారు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండగా, జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన యాదాద్రి భువనగిరి జిల్లాలో చేరింది. అదేసమయంలో ఈ మండలంలోని 4 రెవెన్యూ గ్రామాలను కొత్తగా ఏర్పడిన మోటకొండూరు మండలంలో విలీనం చేశారు. మండల సరిహద్దులు: ఈ మండలం యాదాద్రి జిల్లాలో ఈశాన్యం వైపున జనగామ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి దక్షిణాన మోటకొండూరు మండలం, పశ్చిమాన యాదగిరిగుట్ట మండలం, వాయువ్యాన రాజాపేట మండలం, ఉత్తరాన మరియు తూర్పున జనగామ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 50242, 2011 నాటికి జనాభా 2853 తగ్గి 47389కు తగ్గింది. 2001 జనాభా ప్రకారము జిల్లాలో 24వ స్థానంలో ఉండగా 2011 నాటికి 33వ స్థానానికి దిగజారింది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47389. ఇందులో పురుషులు 23557, మహిళలు 23832. స్త్రీపురుష నిష్పత్తి 1012/ప్రతి వెయ్యి పురుషులకు. రాజకీయాలు: ఈ మండలము ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. ఆలేరు నుంచి 5 సార్లు విజయం సాధించిన మోత్కుపల్లి నర్సింహులు ఈ మండలమునకు చెందినవారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Alair, Kolanupaka, Srinivasapuram, Patelguda, Bahadoorpeta, Manthapur, Kolluru, Tangutoor, Sharajpet, Golanakonda
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు:
కొలనుపాక (Kolanupaka):కొలనుపాక యాదాద్రి జిల్లా ఆలేరు మండలమునకు చెందిన గ్రామము. ఇది ప్రముఖ జైనక్షేత్రం. క్రీ.శ.9వ శతాబ్దంలో రాష్ట్రకూటుల పాలనలో ఇది ప్రాముఖ్యం చెందింది. దీనికి కులపాల అని కూడా పిలుస్తారు. స్వాతంత్ర్య సమరయోధుడు, జడ్పీ చైర్మెన్‌గా పనిచేసిన ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి ఈ గ్రామంలోనే జన్మించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పాటలతో హోరెత్తించిన విమలక్క ఈ గ్రామానికి చెందినది. పారుపల్లి (Parupalli): పారుపల్లి యాదాద్రి జిల్లా ఆలేరు మండలమునకు చెందిన గ్రామము. 5 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన మోత్కుపల్లి నర్సింహులు స్వగ్రామం. గ్రామంలో మారెమ్మ గుడి ఉంది. రాఘవాపూర్ (Raghavapur): రాఘవాపూర్ యాదాద్రి జిల్లా ఆలేరు మండలమునకు చెందిన గ్రామము. 2004లో ఆలేరు ఎమ్మెల్యేగా ఎన్నికైన కుడుదుల నగేష్ స్వగ్రామం. ఈయన తెరాస జిల్లా అధ్యక్షులుగా కొంతకాలం పనిచేశారు. షారాజీపేట (Sharajipet): షారాజీపేట యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామానికి చెందిన చింతకింది మల్లేశం పోచంపల్లి చీరెలు నేయుటలో శ్రమ, కాలం ఆదా చేసే ఆసుయంత్రాన్ని కనుగొన్నాడు. రాష్ట్రపతి నుంచి ఉత్తమ గ్రామీణ ఆవిష్కర్తగా అవార్డు పొందడమే కాకుండా 2007లో పద్మశ్రీ పురస్కారం కూడా పొందాడు. 2019లో ఈయన జీవితం ఆధారంగా "మల్లేశం" పేరుతో బయోపిక్ సినిమా నిర్మించబడింది. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
= = = = =
|
5, ఆగస్టు 2013, సోమవారం
ఆలేరు మండలం (Alair Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి