19, జూన్ 2014, గురువారం

తెలంగాణ వార్తలు - 2012 (Telangana News - 2012)


ఇవి కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ వార్తలు-2012జాతీయ వార్తలు-2012అంతర్జాతీయ వార్తలు-2012క్రీడావార్తలు-2012

తెలంగాణ వార్తలు - 2012 (Telangana News - 2012)
  • 2012, జనవరి 19: రాష్ట్ర చేనేత శాఖామంత్రి పి.శంకర్ రావు కేబినెట్ నుంచి బర్తరఫ్ అయ్యారు. 
  • 2012, జనవరి 19: మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణ గ్రామం నుంచి భారతీయ జనతా పార్టీ పోరుయాత్ర ప్రారంభించింది.   
  • 2012, ఫిబ్రవరి 4: రాష్ట్ర 16వ అభ్యుదయ రచయితల సంఘం మహాసభలు సూర్యాపేటలో నిర్వహించబడ్డాయి.
  • 2012, ఫిబ్రవరి 6: రాష్ట్ర మంత్రివర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్ లకు స్థానం లభించింది.
  • 2012, ఫిబ్రవరి22: సీపీఎం రాష్ట్ర మహాసభలు కరీంనగర్‌లో ప్రారంభమయ్యాయి.
  • 2012, మార్చి 17: మహబూబ్‌నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి వస్తువులు బయటపడ్డాయి.  
  • 2012, ఏప్రిల్ 20: చేనేత రంగంలో పేరుగాంచిన గజం రాములు మరణించారు.
  • 2012, మే 5: ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల మధ్య ఒప్పందం కుదిరింది.
  • 2012, జూలై 26: ప్రముఖ చిత్రకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు కొండపల్లి శేషగిరిరావు మరణించారు.  
  • 2012, ఆగస్టు 2: ఒలింపిక్స్‌లో సెమీస్ చేరిన తొలి భారతీయ షట్లర్‌గా సైనానెహ్వాల్ రికార్డు సృష్టించింది.
  • 2012, ఆగస్టు 7: ఆదిలాబాదు జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ మరణించారు.
  • 2012, ఆగస్టు 24: సాహితీవేత్త జువ్వాడి గౌతమరావు మరణించారు. 
  • 2012, ఆగస్టు 20: చిత్రకారుడు కాపు రాజయ్య మరణించారు.  
  • 2012, సెప్టెంబరు 2: తెలంగాణ రచయిత సంఘం 6వ రాష్ట్ర మహాసభలు నిర్మల్‌లో ప్రారంభమయ్యాయి.
  • 2012, సెప్టెంబరు 21: నిజాం విమోచనోద్యమకారుడు, ప్రముఖ తెలంగాణ ఉద్యమనేత కొండా లక్ష్మణ్ బాపూజీ మరణించారు.
  • 2012, అక్టోబరు 5: హైదరాబాదులో ట్యాంక్‌బండ్ పై కొమురంభీం విగ్రహం ప్రతిష్టించబడింది.  
  • 2012, అక్టోబరు 6: ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల గవర్నరుగా పనిచేసిన మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బి.సత్యనారాయణరెడ్డి మరణించారు.
  • 2012, అక్టోబరు 19: ఖమ్మంను నగరపాలక సంస్థగా మారిస్తూ ఉత్తర్వు జారీచేయబడింది.
  • 2012, డిసెంబరు 21: కాకతీయ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2013, 2014,



 = = = = =

విభాగాలు: తెలంగాణ వార్తలు, 2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక