6, జూన్ 2014, శుక్రవారం

తెలంగాణ వార్తలు - 2013 (Telangana News - 2013)


ఇవి కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ వార్తలు-2013జాతీయ వార్తలు-2013అంతర్జాతీయ వార్తలు-2013క్రీడావార్తలు-2013

జనవరి 2013:
ఫిబ్రవరి 2013:
  • 2013, ఫిబ్రవరి 3: మాజీ మంత్రి సరోజినీ పుల్లారెడ్డి మరణించారు.
  • 2013, ఫిబ్రవరి 8: మాజీ మంత్రి డి.నర్సింగరావు మరణించారు.
  • 2013, ఫిబ్రవరి 10: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి మరోసారి నియామకం.
  • 2013, ఫిబ్రవరి 21: హైదరాబాదులో దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో జంటపేలుళ్ళు.
  • 2013, ఫిబ్రవరి 28: ఓరుగల్లు నగరానికి జాతీయస్థాయిలో ఉత్తమ చారిత్రక నగరంగా గుర్తింపు లభించింది.
మార్చి 2013:
  • 2013, మార్చి 3: మెదక్ జిల్లా జహీరాబాదులో ట్రాక్టర్ల తయారీ పరిశ్రమ ప్రారంభించబడింది.
  • 2013, మార్చి 11: ముఖ్యమంత్రిచే రెవెన్యూ సదస్సులు మహబూబ్‌నగర్ జిల్లా మందిపల్లి గ్రామంలో ప్రారంభమైనవి.
  • 2013, మార్చి 26: దొమ్మాట మాజీ ఎమ్మెల్యే ఖాజామొహినుద్దీన్ మరణించారు.
ఏప్రిల్ 2013:
  • 2013, ఏప్రిల్ 3: రాష్ట్రంలో కొత్తగా 10 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వు జారీ.
  • 2013, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి 12వ వార్షికోత్సవం నిజామాబాదు జిల్లా ఆర్మూరులో నిర్వహించబడింది.
మే 2013:
  • 2013, మే 1: మెదక్ జిల్లా న్యానకల్‌లో మంజీరా కుంభమేళ ప్రారంభమైంది.
  • 2013, మే 11: మెదక్ పట్టణానికి చెందిన ఎం.ఎస్.గౌడ్ ప్రపంచంలోని 100 అత్యుత్తమ వైద్యులలో ఒకరుగా ఎంపికయ్యారు.
  • 2013, మే 20: భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడిగా బండారు దత్తాత్రేయ నియామకం. 
  • 2013, మే 26: మంత్రులు సబితా ఇంద్రారెడ్డి (హోంశాఖ), ధర్మాన ప్రసాదరావు (రోడ్డు భవనాల శాఖ) రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు.
  • 2013, మే 29: కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి.
జూన్ 2013:
  • 2013, జూన్ 3: తెలంగాణ నగరా సమితి వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి, 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన  నాగం జనార్థన్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోచేరారు.
  • 2013, జూన్ 16: రాష్ట్రానికి చెందిన  జిల్లెల చిన్నారెడ్డికి ఏఐసిసి కార్యదర్శి పదవి లభించింది.
  • 2013, జూన్ 17: కరీంనగర్ జిల్లా పందిల్ల గ్రామంలో క్రీ.శ.7-10 మధ్యకాలం నాటి పురాతనమైన జైనవిగ్రహం బయల్పడింది.
  •  2013, జూన్ 22: గద్వాలలో 2011 సం.పు టీవి నందుల ప్రధానోత్సవం జరిగింది.
  • 2013, జూన్ 29: మెదక్ జిల్లాలో చేగుంట మరియు 10 గ్రామపంచాయతీల విలీనంతో చేగుంట నగరపంచాయతి ఏర్పాటుకు ఉత్తర్వు జారీ.
జూలై 2013:
  • 2013 జూలై 7: మాజీ మంత్రి, గద్వాలకు చెందిన సీనియర్ నాయకుడు డి.కె.సమరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు.  
  • 2013, జూలై 8: సికింద్రాబాదులో పాత భవనం కూలి 13మంది మరణించారు.
  • 2013, జూలై 12: మజ్లిస్ బజావో తహరిక్ (ఎంబిటి) పార్టీ అధ్యక్షుడు ఆదం మాలిక్ మరణించారు. 
  • 2013, జూలై 13: నల్గొండ జిల్లాకు చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కోడి సర్వయ్య మరణించారు. 
  • 2013, జూలై 14: మాజీ కేంద్ర మంత్రి, ఆదిలాబాదు జిల్లాకు చెందిన సముద్రాల వేణుగోపాలచారి తెరాసలో చేరారు. 
  • 2013, జూలై 23: గ్రామపంచాయతి ఎన్నికల తొలి విడత పోలింగ్ జరిగింది. 
  • 2013, జూలై 27: గ్రామపంచాయతీ ఎన్నికల రెండవ విడత పోలింగ్ జరిగింది. 
  • 2013, జూలై 30: మాజీ మంత్రి కొండా సురేఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 
  • 2013, జూలై 30: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేసేందుకు కేంద్రం అధికారికంగా ప్రకటించింది.
  • 2013, జూలై 31: మెదక్ లోకసభ సభ్యురాలు విజయశాంతి తెరాస నుంచి సస్పెండ్ అయ్యారు. 
  • 2013, జూలై 31: పంచాయతి ఎన్నికల 3వ విడత ఎన్నికలు జరిగాయి. 
ఆగస్టు 2013:
  • 2013, ఆగస్టు 1: పి.వి.నరసింహారావు కుమారుడు, రాష్ట్ర మాజీ మంత్రి పి.వి.రంగారావు మరణించారు.
  • 2013, ఆగస్టు 3: రాష్ట్ర మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి మరణించారు.
  • 2013, ఆగస్టు 3: తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు ప్రియంవద మరణించారు.
  • 2013, ఆగస్టు 9: ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి పి.వి.సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సెమీస్ చేరి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.
  •  2013, ఆగస్టు 10: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పి.వి.సింధు కాంస్యపతకం సాధించింది.
  • 2013, ఆగస్టు 11: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి హైదరాబాదు విచ్చేసి నవభారత యువభేరీ సదస్సులో పాల్గొన్నారు. 
  • 2013, ఆగస్టు 11: ఆదిలాబాదు జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడు, మాజీ ఎంపీ ఇంద్రకరణ్ రెడ్డి వైకాపాకు రాజీనామా చేశారు. 
  • 2013, ఆగస్టు 17: మాజీమంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు.
  • 2013, ఆగస్టు 28: దిల్‌సుఖ్‌నగర్ జంటపేలుళ్ళ కేసులో నిందితుడు యాసిన్ భత్కల్ అరెస్ట్ అయ్యాడు. 
  • 2013, ఆగస్టు 31: హైదరాబాద్ హాట్‌షాట్స్ ఐబీఎల్ టైటిల్ సాధించింది. 
సెప్టెంబరు 2013:
  • 2013, సెప్టెంబరు 4: మాజీ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
  • 2013, సెప్టెంబరు 8: ఆదిలాబాదు జిల్లా నిర్మల్‌కు చెందిన కవి దామెర రాములుకు సి.నారాయణరెడ్డి సాహిత్య పురస్కారం లభించింది. 
  • 2013, సెప్టెంబరు 11: సంగారెడ్డిలో రాష్ట్ర పశుసంవర్థన శాఖ ఆధ్వర్యంలో సునందిని (దూడల పెంపక కార్యక్రమం) ప్రారంభమైంది.
  • 2013, సెప్టెంబరు 15: తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బషీరుద్దీన్ బాబూఖాన్ మరణించారు.
  • 2013, సెప్టెంబరు 21: తెలంగాణ రచయితల సంఘం రెండవ సదస్సు కరీంనగర్‌లో ప్రారంభమైంది.
  • 2013, సెప్టెంబరు 28: పాలమూరు (మహబూబ్‌నగర్) పట్టణంలో సుష్మాస్వరాజ్ యొక్క భారీ "తెలంగాణ ప్రజాగర్జన" బహిరంగ సభ నిర్వహించబడింది.
అక్టోబరు 2013:
  • 2013, అక్టోబరు 3: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 
  • 2013, అక్టోబరు 12: నూతనంగా నిర్మించిన గద్వాల- రాయచూర్ రైలుమార్గం ప్రారంభమైంది.  
  • 2013 అక్టోబరు 30: కొత్తకోట మండలం పాలెం వద్ద జాతీయ రహదారిపై బస్సుకు మంటలు చెలరేగి 45 మంది సజీవదహనం అయ్యారు. 
 నవంబరు  2013:
  • 2013, నవంబరు 8: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో బాలోత్సవ్-2013 ప్రారంభమైంది. 
  • 2013, నవంబరు 13: మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన శాస్త్రవేత్త డా.వలిపె రాంగోపాలరావుకు 2013 సం.పు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అవార్డు లభించింది. 
  • 2013, నవంబరు 29: కృష్ణా జల వివాదాలపై నియమించిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తన తుది తీర్పును వెలువరించింది.
 డిసెంబరు  2013:
  • 2013,డిసెంబరు 5: తెలంగాణ ఏర్పాటు ముసాయుదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
  • 2013, డిసెంబరు 18: కాత్యాయిని విద్మహే 2013 సం.పు సాహిత్య అకాడమీ పురస్కారంకు ఎంపికైనారు (తెలుగు భాషలో).
  • 2013, డిసెంబరు 18: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కామన్ గుర్తుగా సీలింగ్ ఫ్యాన్ కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 
  • 2013, డిసెంబరు 20: వరంగల్ నగరంలో కాకతీయ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
  • 2013, డిసెంబరు 24: తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల భూమయ్య రోడ్డు ప్రమాదంలో మరణించారు.
  • 2013, డిసెంబరు 30: ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడిగా పనిచేసిన చిలకూరి వామన్‌రెడ్డి మరణించారు. 

ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2014,



 = = = = =

విభాగాలు: తెలంగాణ వార్తలు, 2013, 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక