క్రీడా వార్తలు 2015 (Sports News 2015)
జనవరి 2015:
- 2015, జనవరి 2: భారత బాక్సింగ్ సమాఖ్య పేరు "బాక్సింగ్ ఇండియా"గా మారింది.
- 2015, జనవరి 6: న్యూజీలాండ్‌కు చెందిన విలియం సన్, వాట్సన్‌లు 6వ వికెట్టుకు 365 పరుగుల భాగస్వామ్యంతో ప్రపంచరికార్డు సృష్టించారు.
- 2015, జనవరి 12: వెస్టీండీస్ జట్టు టీ-20లో 231 పరుగుల లక్ష్యాన్ని ఛేధించి కొత్త రికార్డు నెలకొల్పింది.
- 2015, జనవరి 13: ఫిఫా 2014 సంవత్సరపు ఉత్తమ ఆటగాడు అవార్డు క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్)కు ప్రకటించబడింది.
- 2015, జనవరి 17: వన్డేలలో అతివేగంగా హాఫ్‌సెంచరీ (16 బంతుల్లో) మరియు అతివేగంగా సెంచరీ (31 బంతుల్లో) సాధించి దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ కొత రికార్డు సృష్టించాడు.
- 2015, జనవరి 29: రాష్ట్రస్థాయి పాఠశాలల అథ్లెటిక్స్ పోటీలలో యానాంకు చాంపియన్‌షిప్ లభించింది.
- 2015, జనవరి 31: తిరువనంతపురంలో 35వ జాతీయ క్రీడలు ప్రారంభమయ్యాయి.
- 2015, జనవరి 31: ఆస్ట్రేలియన్ ఓపెన్-2015 మహిళల టైటిల్‌ను అమెరికాకు చెందిన సెరీనా విలియమ్స్ చేజిక్కించుకుంది.
ఫిబ్రవరి 2015:
- 2015, ఫిబ్రవరి 1: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంప్‌ను పి.వి.సింధూ గెలుచుకుంది.
- 2015, ఫిబ్రవరి 1: సెలబ్రిటి క్రికెట్ లీగ్-5ను తెలుగు వారియర్స్ జట్టు కైవసం చేసుకుంది.
- 2015, ఫిబ్రవరి 1: ఆస్ట్రేలియన్ ఓపెన్-2015 పురుషుల టైటిల్‌ను సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్ గెలుచుకున్నాడు.
- 2015, ఫిబ్రవరి 1: ఆస్ట్రేలియన్ ఓపెన్-2015 మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను మార్టీనా హింగిస్‌తో కలిసి భారత్‌కు చెందిన లియాండర్ పేస్ గెలుచుకున్నాడు.
- 2015, ఫిబ్రవరి 14: 11వ ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది.
- 2015, ఫిబ్రవరి 21: కేవలం 18 బంతుల్లో అర్థశతకం చేసి మెక్‌కలమ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.
- 2015, ఫిబ్రవరి 24: ప్రపంచకప్ క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ చేసినవాడిగా క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు.
మార్చి 2015:
- 2015, మార్చి 4: ఆస్ట్రేలియా అఫ్ఘనిస్తాన్‌పై 275 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రపంచకప్ టోర్నీలో సరికొత్త రికార్డు సృష్టించింది.
- 2015, మార్చి 4: ఆస్ట్రేలియా అఫ్ఘనిస్తాన్‌పై 417 పరుగులు చేసి ప్రపంచకప్‌లో అత్యధిక టీంస్కోరు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది.
- 2015, మార్చి 6: భారత్ ప్రపంచకప్ క్రికెట్‌లో వరసగా 4వ విజయం నమోదు చేసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
- 2015, మార్చి 8: ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంప్ మహిళల విజేతగా కరోలినా మారిన్ (స్పానిష్). ఫైనల్లో సైనా నెహ్వాల్‌పై విజయం.
- 2015, మార్చి 12: రంజీట్రోఫిని కర్ణాటక జట్టు గెలుచుకుంది.
- 2015, మార్చి 15: సంతోష్ ట్రోఫి ఫుట్‌బాల్‌ను సర్వీసెస్ జట్టు గెలుచుకుంది.
- 2015, మార్చి 15: స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ పురుషుల విజేతగా కిదాంబి శ్రీనివాస్ టైటిల్ సాధించాడు.
- 2015, మార్చి 20: ఇరానీ కప్‌ను కర్ణాటక గెలుచుకుంది.
- 2015, మార్చి 21: ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్‌గా న్యూజీలాండ్‌కు చెందిన మార్టిన్ గప్తిల్ అవతరించాడు.
- 2015, మార్చి 28: సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్‌లో టాప్ ర్యాంక్ సాధించింది.
- 2015, మార్చి 29: ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ 2015ను ఆస్ట్రేలియా గెలుచుకుంది.
- 2015, మార్చి 29: ఇండియా ఓపెన్ సీరీస్ పురుషుల టైటిల్‌ను కిదాంని శ్రీకాంత్, మహిళల టైటిల్‌ను సైనా నెహ్వాల్ గెలుచుకున్నారు.
ఏప్రిల్ 2015:
- 2015, ఏప్రిల్ 1: ఐసిసి అధ్యక్షుడు ముస్తఫా కమల్ రాజీనామా చేశాడు.
- 2015, ఏప్రిల్ 12: సానియామీర్జా మహిళల టెన్నిస్ డబుల్స్‌లో నెంబర్ వన్ ర్యాంక్ సాధించింది.
మే 2015:
- 2015, మె 3: ప్రపంచ బాక్సింగ్ టైటిల్‌ను అమెరికాకు చెందిన మేవెదర్ గెలుచుకున్నాడు.
- 2015, మే 24: ఐపీఎల్-2015 టోర్నీని ముంబాయి ఇండియన్స్ గెలుచుకుంది
- 2015, మే 27: అవినీతి కేసులో ఫీఫా ఉపాధ్యక్షుడు జెఫ్రీ వెబ్ అరెస్ట్ అయ్యాడు.
- 2015, మే 30: టెస్టులలో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌గా అలిస్టర్ కుక్ అవతరించాడు.
జూన్ 2015:
- 2015, జూన్ 6: భారత్-ఏ టీ, అండర్-19 జట్ల కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ నియమితుడైనాడు.
- 2015, జూన్ 6: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల టైటిల్‌ను సెరెనా విలియమ్స్ గెలుచుకుంది.
- 2015, జూన్ 8: శ్రీలంక అంతర్జాతీయ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌ను సాయి ప్రణీత్ గెలుచుకున్నాడు.
- 2015, జూన్ 7: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల టైటిల్‌ను వావ్రింకా గెలుచుకున్నాడు.
- 2015, జూన్ 8: కెనెడియన్ గ్రాండ్‌ప్రి ని లూయిస్ హామిల్టన్ కైవసం చేసుకున్నాడు.
- 2015, జూన్ 10: భారత మాజీ టెస్టు క్రికెటర్ హేమంత్ కనీత్కర్ మరణం.
- 2015, జూన్ 12: చిలీలోని సాంటియాగోలో కోపా అమెరికా కప్ టోర్నమెంట్ ప్రారంభమైంది.
- 2015, జూన్ 26: ఎన్‌బీఏ బాస్కెట్‌బాల్ లీగ్ డ్రాఫ్ట్‌లో చోటు దక్కించుకున్న తొలి భారతీయుడిగా సత్నామ్‌సింగ్ చరిత్ర సృష్టించాడు.
- 2015, జూన్ 27: ఐసిసి అధ్యక్షుడిగ్ జహీర్ అబ్బాస్ ఎన్నికయ్యాడు.
- 2015, జూన్ 28: మహిళల లిస్ట్-ఏ క్రికెట్‌లో హారికా యాదవ్ అత్యధిక పరుగులు (308) చేసి రికార్డు సృష్టించింది.
జూలై 2015:
- 2015, జూలై 5: కోపా అమెరికా కప్‌ను చిలీ గెలుచుకుంది. ఫైనల్లో అర్జెంటీనాపై విజయం.
- 2015, జూలై 6: ఫీఫా మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను అమెరికా గెలుచుకుంది. (ఫైనల్లో జపాన్‌పై విజయం).
- 2015, జూలై 6: మిథాలి రాజ్ మహిళల వన్డే క్రికెట్‌లో 5000 పరుగులు పూర్తిచేసిన తొలి భారతీయురాలిగా అవతరించింది.
- 2015, జూలై 8: కోచి ఫ్రాంచైజీకి రూ.550 కోట్లు చెల్లించాలని ఆర్బిట్రేటర్ ఆర్.సి.లహోటి ఆదేశించారు.
- 2015, జూలై 10: దక్షిణాఫ్రికా బౌలర్ రబాడా వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలతో (6/16) ప్రపంచరికార్డు సృష్టించాడు.
- 2015, జూలై 11: వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ గెలుచుకుంది.
- 2015, జూలై 11: వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను సానియామీర్జా, మార్టినా హింగిస్ జంట సాధించింది.
- 2015, జూలై 12: లియాండర్ పేస్, మార్టినా హింగిస్ జోడి వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్ గెలుచుకుంది.
- 2015, జూలై 18: భారత్‌కు చెందిఅన్ శుభమ్ జగ్లాన్ ప్రపంచ జూనియర్ గోల్ఫ్ టైటిల్ సాధించాడు.
- 2015, జూలై 22:బ్రిటన్‌లోని ఒక సంస్థ ధ్యాన్‌చంద్‌కు "భారత్ గౌరవ్" పురస్కారం ప్రకటించింది.
ఆగస్టు 2015:
- 2015, ఆగస్టు 1; ప్రపంచ ఆర్చెరీ చాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారతీయుడిగా రజత్ చౌహాన్ అవతరించాడు.
- 2015, ఆగస్టు 8: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నెట్‌బాల్ ప్రపంచకప్ ప్రారంభమైంది.
- 2015, ఆగస్టు 10: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంప్ పోటీలు జకర్తాలో ప్రారంభమయ్యాయి.
- 2015, ఆగస్టు 10: ప్రొ కబడ్డీ లీగ్‌లో జయపుర జట్టు 30 పాయింట్లతో దిల్లీ దబాంగ్‌పై విజయం సాధించి రికార్డు విజయం నమోదుచేసింది.
- 2015, ఆగస్టు 16: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సైనానెహ్వాల్ రజతపతకం సాధించింది.
- 2015, ఆగస్టు 29: సానియామీర్జాకు రాజీవ గాంధీ ఖేల్ రత్న పురస్కారం ప్రధానం చెయబడింది.
- 2015, ఆగస్టు 29: భారత మహిళల హాకీజట్టు 36 సం.ల తర్వాత రియో ఒలింపిక్ క్రీడలలో ప్రాతినిధ్యం లభించింది.
- 2015, ఆగస్టు 29: ప్రపంచ అథ్లెటిక్స్ చాంప్ పోటీలలో 5000, 10000 మీ. పరుగులో స్వర్ణాలు సాధించి మోఫరా రికార్డు సృష్టించాడు.
సెప్టెంబరు 2015:
- 2015, సెప్టెంబరు 2: 2022 కామన్వెల్త్ క్రీడలను డర్బాన్ (దక్షిణాఫ్రికా)లో నిర్వహించాలని కామన్వెల్త్ సమాఖ్య ఏకగ్రీవంగా తీర్మానించింది.
- 2015, సెప్టెంబరు 6: తెలంగాణ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాజి ఇండియా జూనియర్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్ సాధించింది.
- 2015, సెప్టెంబరు 7: జాతీయ అండర్-13 బాలికల చెస్ చాంప్‌లో తెలుగమ్మాయి నూతక్కి ప్రియాంక విజేతగా నిలిచింది.
- 2015, సెప్టెంబరు 11: ఎపియాలో జరిగిన కామన్వెల్త్ యువ క్రీడలలో భారత్‌కు 5వ స్థానం లభించింది.
- 2015.సెప్టెంబరు 16: షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్ రియో ఒలింపిక్స్ కు అర్హత పొందింది.
ఇవి కూడా చూడండి: క్రీడా వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, |
|
EXCELLENT SITE
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు
తొలగించండిమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు
రిప్లయితొలగించండి