4, జనవరి 2015, ఆదివారం

తెలంగాణ వార్తలు - 2015 (Telangana News - 2015)

తెలంగాణ వార్తలు - 2015 (Telangana News - 2015)
ఇవి కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ వార్తలు-2015జాతీయ వార్తలు-2015అంతర్జాతీయ వార్తలు-2015క్రీడావార్తలు-2015

జనవరి 2015:
  • 2015, జనవరి 2: సార్వత్రిక ఎన్నికలలో ఓటర్లను చైతన్యపర్చినందుకు గాను ఈటీవి-ఆంధ్రప్రదేశ్, ఈటీవి-తెలంగాణ ఎన్నికల సంఘంచే పురస్కారం పొందింది.
  • 2015, జనవరి 2: గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా రాంశరణ్ నియమితులైనారు. 
  • 2015, జనవరి 4: తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్.రమణ నియమితులైనారు.
  • 2015, జనవరి 7: తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ సంచాలకులుగా ఏకే ఖాన్ నియమితులైనారు. 
  • 2015, జనవరి 13: సికింద్రాబాదు కంటోన్మెంట్ ఎన్నికలలో తెరాస విజయం సాధించింది.
  • 2015, జనవరి 20: నక్కలగండి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి ఆమోదించారు.
  • 2015, జనవరి 20: నారాయణపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎల్కోటి ఎల్లారెడ్డి మరణించారు. 
  • 2015, జనవరి 25: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, వైద్య-ఆరోగ్య శాఖ మంత్రి టి.రాజయ్య మంత్రిమండలి నుంచి బర్తరఫ్ అయ్యారు. 
  • 2015, జనవరి 25: తెలంగాణ మంత్రివర్గంలో కడియం శ్రీహరికి స్థానం లభించింది. 
  • 2015, జనవరి 26: తెలంగాణ రాష్ట్రానికి చెందిన డాక్టర్ మంజుల అనగాని, మిథాలి రాజ్, పి.వి.సింధూలకు పద్మశ్రీ లభించింది. 
  • 2015, జనవరి 28: వరంగల్ నగరానికి గ్రేటర్ హోదా కల్పించబడింది. 
ఫిబ్రవరి 2015:
  • 2015, ఫిబ్రవరి 2: సమరయోధుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జెట్టి నాగేశ్వరరావు మరణించారు. 
  • 2015, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్ట్రంలో ఇసుక గరిష్ట ధరను రూ.600గా ప్రభుత్వం నిర్ణయించింది. 
  • 2015, ఫిబ్రవరి 5: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతన సవరణకై 43% ఫిట్‌మెంట్ ప్రకటించింది. 
  • 2015, ఫిబ్రవరి 5: సమరయోధుడు రఘువీర్ రావు మరణించారు. 
  • 2015, ఫిబ్రవరి 6: కార్వాన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అఫ్సర్‌ఖాన్ మరణించారు. 
  • 2015, ఫిబ్రవరి 5: జాతీయ క్రీడలలో రోయింగ్ పోటీలలో తెలంగాణకు 2 స్వర్ణాలు లభించాయి. 
  • 2015, ఫిబ్రవరి 7: ఖమ్మం జిల్లా నల్లముడి అడవుల్లోని ప్రాచీనమైన చిత్రలేఖనాలు వెలుగులోకి వచ్చాయి. 
  • 2015, ఫిబ్రవరి 9: జాతీయ క్రీడల కనోయింగ్-కయాకింగ్ పోటీలో తెలంగాణకు స్వర్ణపతకం లభించింది.
  • 2015, ఫిబ్రవరి 12: తెలంగాణలో వ్యాపార, వాణిజ్య సంస్థలకు సెలవులు ఎత్తివేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. 
  • 2015, ఫిబ్రవరి 15: తెలంగాణ గాంధీగా ప్రసిద్ధిచెందిన భూపతి కృష్ణమూర్తి మరణించారు. 
  • 2015, ఫిబ్రవరి 21: మహబూబ్‌నగర్ జిల్లా మండల పరిధిలోని తిమ్మాయిపల్లిలో 2000 సంవత్సరాల క్రిందటి ప్రాచీన గాజుపరిశ్రమ బయటపడింది.
  • 2015, ఫిబ్రవరి 23: పాఠశాల క్రీడాసమాఖ్య 60వ జాతీయ స్థాయి అండర్-14 క్రికెట్ పోటీలు మహబూబ్‌నగర్‌లో ప్రారంభమయ్యాయి. 
 మార్చి 2015:
  • 2015, మార్చి 2: తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్‌ కుమార్ రెడ్డి నియమితులైనారు. 
  • 2015, మార్చి 2: మెదక్ జిల్లా కొండపాక మండలం, మర్పడగ గ్రామంలో విష్ణుకుండినుల కాలం నాటి చారిత్రక అవశేషాలు లభించాయి. 
  • 2015, మార్చి 3: ఆదిలాబాదు జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి సమీపంలో సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంటులో 600 మెగావాట్ల అదనపు ప్లాంటునకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 
  • 2015, మార్చి 3: ఖమ్మం జిల్లా బాటన్ననగర్ సమీపంలో బృహత్‌శిలాయుగం కాలం నాటి ఆనవాళ్ళు లభ్యమైనాయి. 
  • 2015, మార్చి 5: యాదగిరిగుట్టకు యాదాద్రి పుణ్యక్షేత్రంగా నామకరణం చేశారు.
  • 2015, మార్చి 6: స్వాతంత్ర్య సమరయోధుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంది మల్లారెడ్డి మరణించారు. 
  • 2015, మార్చి 7: తెలంగాణ రాష్ట్ర మొదటి సీపీఐ రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో ప్రారంభమైనాయి. 
  • 2015, మార్చి 11: ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ 2015-16 బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. (ముఖ్యాంశాలు)
  • 2015, మార్చి 12: సదాశివనగర్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుచే మిషన్ కాకతీయ ప్రారంభించబడింది. 
  • 2015, మార్చి 14: మహబూబ్‌నగర్ జిల్లా జూపల్లి గ్రామపరిధిలో మధ్యరాతియుగానికి చెందిన ఆనవాళ్ళు కనుగొన్నారు.
  • 2015, మార్చి 17: ముఖ్యమంత్రి కేసిఆర్‌కు CNN-IBS పాపులర్ ఛాయిస్ అవార్డు 2014 లభించింది. 
  • 2015, మార్చి 20: ప్రాణహిత ప్రాజెక్టుకు కాళేశ్వరం పేరు పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 
  • 2015, మార్చి 25: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలలో భాజపా అభ్యర్థి నారపరాజు రామచంద్రారావు విజయం సాధించారు. 
  • 2015, మార్చి 26: తెలంగాణ శాసనసభ ప్రజాపద్దుల కమిటి చైర్మెన్‌గా పటోళ్ల కిష్టారెడ్డి, అంచనాల కమిటి చైర్మెన్‌గా సోలిపేట రామలింగారెడ్డి పేర్లను స్పీకర్ ఖరారుచేశారు. 
  • 2015, మార్చి 31: తెలంగాణ శాసనమండలి విపక్షనేతగా షబ్బీర్ అలీ ఎంపికయ్యారు.
 ఏప్రిల్ 2015:
  • 2015, ఏప్రిల్ 1: వి.ఎం.బంజార వద్ద విజయవాడ-జగదల్‌పూర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు కేంద్రమంత్రి నితిన్ గడ్గరి శంకుస్థాపన చేశారు. 
  • 2015, ఏప్రిల్ 4: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం వద్ద ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు తీవ్రవాదుల మరణం.
  • 2015, ఏప్రిల్ 6: "ఎలిమినేటి మాధవరెడ్డి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి సంస్థ" పేరును తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిసంస్థగా మార్చబడింది.
  • 2015, ఏప్రిల్ 7: ఆదిలాబాదు నియోజకవర్గం మాజీ ఎంపి మధుసూదన్ రెడ్డి మరణించారు. 
  • 2015, ఏప్రిల్ 8: హైద్రాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం కులపతిగా రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ నియమితులైనారు.
  • 2015, ఏప్రిల్ 9: నల్గొండ జిల్లాకు చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు నర్రా రాఘవరెడ్డి మరణించారు. 
  • 2015, ఏప్రిల్ 10: తెలంగాణ సాయుధపోరాట యోధుడు కానూరి వెంకటేశ్వరరావు మరణం. 
  • 2015, ఏప్రిల్ 10: ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి యూజీసీ గుర్తింపు లభించింది.
  • 2015, ఏప్రిల్ 12: సానియామీర్జా మహిళల టెన్నిస్ డబుల్స్‌లో నెంబర్ వన్ ర్యాంక్ సాధించింది. 
  • 2015, ఏప్రిల్ 18: తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా మహబూబ్‌నగర్ ఎంపి జితేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. 
  • 2015, ఏప్రిల్ 20: తెరాస అధ్యక్షుడిగా కె.చంద్రశేఖర్ రావు ఏకగ్రీవంగా మరోసారి ఎన్నికయ్యారు. 
  • 2015, ఏప్రిల్ 25: తెరాస ప్లీనరీ హైదరాబాదులో ప్రారంభమైంది. 
  • 2015, ఏప్రిల్ 25: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెరాసలో చేరారు. 
  • 2015, ఏప్రిల్ 27: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో తెలంగాణకు చెందిన సండ్ర వెంకటవీరయ్య, జి.సాయన్నలకు స్థానం లభించింది. 
మే 2015:
  • 2015, మే 1: పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. 
  • 2015,మే 7: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోసలే నియమితులైనారు. 
  • 2015, మే 11: "నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆఫ్ ఇందియా 2015" పురస్కారం ఉమా నాగేంద్రమణికి ప్రకటించారు. 
  • 2015, మే 11: తెలంగాణ పిసిసి (మహిళా విభాగం) తొలి అధ్యక్షురాలిగా నేరెళ్ళ శారద నియామకం. 
  • 2015, మే 13: ఆర్టీసి సిబ్బంది సమ్మె విరమణ. తెలంగాణలో 44%, ఆంధ్రప్రదేశ్‌లో 43% ఫిట్‌మెంట్‌కు ప్రభుత్వాలు అంగీకారం. 
  • 2015, మే 22: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధుడు పర్సా సత్యనారాయణ మరణం. 
  • 2015, మే 27: "డ్రన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్" రూపొందించిన అత్యుత్తమ భారతీయ కంపెనీల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన 21 కంపెనీలు స్థానం పొందాయి. 
  • 2015, మే 31: కోడంగల్ శాససభ్యుడు రేవంత్ రెడ్డిని ఏసిబి అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 
జూన్ 2015:
  • 2015, జూన్ 1: శాసనమండలి ఎన్నికలలో (శాసనసభ్యులచే ఎన్నిక) 6 స్థానాలకుగాను తెరాస 5, కాంగ్రెస్ పార్టీ ఒక స్థానం పొందాయి. (విజయం సాధించిన అభ్యర్థులు: కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, బి.వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్, యాదగిరిరెడ్డి, ఆకుల లలిత)
  • 2015, జూన్ 6: నల్గొండ జిల్లా రాజాపేట మండలం నెమిల గ్రామంలో పురాతనమైన నాణేలు బయటపడ్డాయి. 
  • 2015, జూన్ 8: తెలుగు సాహితీవేత్త దాశరథి రంగాచార్య మరణం. 
  • 2015, జూన్ 10: యాదాద్రి-వరంగల్ 4 వరసల రహదారికి కేంద్రం ఆమొదం తెలిపింది.
  • 2015, జూన్ 11: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి భూత్పూరు మండలం కరివెనలో ముఖ్యమంత్రిచే శంకుస్థాపన చేయబడింది. 
  • 2015, జూన్ 11: తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానంను ఆవిష్కరించింది. 
  • 2015, జూన్ 12: డిండి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 
  • 2015, జూన్ 26: తెలంగాణ తొలితరం గజల్ గాయకుడు విఠల్‌రావు మరణం.
  • 2015, జూన్ 28: మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ సమీపంలో ఆదిమానవుల సమాధులు లభించాయి.
జూలై 2015:
  • 2015, జూలై 3: చెన్నమనేని విద్యాసాగర్ రావు రచించిన "ఉనికి" పుస్తకం ఆవిష్కరించబడింది. 
  • 2015, జూలై 5: ఆదిలాబాదు జిల్లాలో కడెం ఎత్తిపోతల పథకం ప్రారంభించబడింది. 
  • 2015, జూలై 6: ఓటుకు నోటు కేసులో సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను అవినీతి నిరోధశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. 
  • 2015, జూలై 8: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన డి.శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 
  • 2015, జూలై 8: అనాబ్ అలీ అనాజ్‌జంగ్ జన్మదినాన్ని (జూలై 11) తెలంగాణ ప్రభుత్వం ఇంజనీర్స్ దినోత్సవంగా ప్రకటించింది.
  • 2015, జూలై 9: ప్రమాణాల పరంగా దక్షిణభారతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రథమస్థానం పొందింది. (ఇండియా టుడే, నీల్సన్ సర్వే ప్రకారం) 
  • 2015, జూలై 9: తెలంగాణ తొలి జానపద కళాకారుడు నీలం గణేష్ రావు మరణం.
  • 2015, జూలై 11: రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం తుర్కపల్లి శివారులో ఆదిమానవుల చిత్రాల బయటపడ్డాయి.
  • 2015, జూలై 14: గోదావరి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. 
  • 2015, జూలై 17: మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం పుల్లూరులో బృహత్‌శిలాయుగం కాలం నాటి సమాధులు బయటపడ్డాయి. 
  • 2015, జూలై 16: ఏపి ఎక్స్‌ప్రెస్ పేరును నవంబరు నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 
 ఆగస్టు 2015:
  • 2015, ఆగస్టు 17: తెలంగాణ రాష్ట్రమంతటా గ్రామజ్యోతి పథకం ప్రారంభమైంది.
  • 2015, ఆగస్టు 25: నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యుడు పట్లోళ్ల కిష్టారెడ్డి మరణం. 
  • 2015, ఆగస్టు 27: ఆకర్షణీయ నగరాల ప్రాథమిక జాబితాలో తెలంగాణ నుంచి గ్రేటర్ హైదరాబాదు, వరంగల్ ఎంపికయ్యాయి. 
  • 2015, ఆగస్టు 29: మహబూబ్‌నగర్‌కు చెందిన వంశీకృష్ణ గిన్నిస్ రికార్డు కోసం 4.2 కిమీ దూరం మూన్ వాక్ చేశాడు.
  • 2015, ఆగస్టు 29: ఆదిలాబాదు జిల్లాలో 6.5 కోట్ల సంవత్సరాల నాయి వృక్షశిలాజాలు బయటపడ్డాయి. 
సెప్టెంబరు 2015:
  • 2015, సెప్టెంబరు 1: తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా సి.నారాయణరెడ్డి ఎన్నికయ్యారు. 
  • 2015, సెప్టెంబరు 4: తెలంగాణ ప్రభుత్వం బీసి జాబితా నుంచి తొలగింపు (కళింగ, గవర, తూర్పు కాపు తదితర) సక్రమమేనంటూ ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చింది.
  • 2015, సెప్టెంబరు 9: కాళోజీ పురస్కారం-2015ను డాక్టర్ అమ్మంగి వేళుగోపాల్‌కు ప్రధానం చేయబడింది. 
  • 2015, సెప్టెంబరు 22: తెలంగాణ రాష్ట్రానికి మరో 3 ఎమ్మెల్సీ స్థానాలు అదనంగా కేటాయించబడ్డాయి. 
  • 2015, సెప్టెంబరు 24: ఆదిలాబాదు జిల్లాకు చెందిన తెలంగాణ ఆయుధ పోరాట యోధుడు ముడుసు ఎల్లయ్య మరణం.
  • 2015, సెప్టెంబరు 24: మాజీ ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు జువ్వాడి నర్సింగరావు మరణం.
అక్టోబరు 2015:
  • 2015, అక్టోబరు 4: తెలంగాణను ఎ-కేటగేరి ఆర్థికశక్తిగా ఇండియా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ గుర్తించింది.
  • 2015, అక్టోబరు 6: కాళేశ్వరం ఎత్తిపోతలకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుచేసింది.
  • 2015, అక్టోబరు 7: నల్గొండ జిల్లా ఇంద్రపాలనగరం (తుమ్మలగూడెం) వద్ద ఘోర బస్సు ప్రమాదంలో 15 మంది మరణించారు.
ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2016,

Tags: Telugu News, తెలుగు వార్తలు,Telangana News in telugu, తెలంగాణ వార్తలు Telangana state current news in telugu

 = = = = =

విభాగాలు: వార్తలు, 2015, 

2 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. క్విజ్ పుస్తకాల రూపకల్పనలో ఉండుటచే ఇక్కడ ఎప్పటికప్పుడు సమాచారం చేర్చడానికి సమయం సరిపోవడం లేదు. సమయం దొరికినప్పుడు తప్పకుండా పూర్తిచేయగలము.

      తొలగించండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక