4, జనవరి 2015, ఆదివారం

అంతర్జాతీయ వార్తలు 2015 (International News 2015)

అంతర్జాతీయ వార్తలు 2015 (International News 2015)
 
ఇవి కూడా చూడండి:  తెలంగాణ వార్తలు-2015ఆంధ్రప్రదేశ్ వార్తలు-2015,   జాతీయ వార్తలు-2015క్రీడావార్తలు-2015

జనవరి 2015:
  • 2015, జనవరి 4: అమెరికా సెనేట్‌కు ఎన్నికైన తొలి నల్లజాతీయుడు ఎడ్వర్డ్ బ్రూక్ మరణించాడు.
  • 2015, జనవరి 9: శ్రీలంక జాతీయ ఎన్నికలలో అధ్యక్షుడు మహింద్ర రాజపక్సే ఓటమి. కొత్త అధ్యక్షుడిగా మైత్రీపాల సిరిసేన ఎన్నికయ్యారు. 
  • 2015, జనవరి 17: చైనాలోని జియాంగ్జు నదిలో పడవ బాల్టాపడి 21మంది మరణించారు. 
  • 2015, జనవరి 18: మనీలాలో జరిగిన పోప్ ప్రాన్సిస్ సందేశ కార్యక్రమానికి 50లక్షల మంది హాజరై ప్రపంచరికార్డు సృష్టించారు. 
  • 2015, జనవరి 20: దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రారంభమైంది.
  • 2015, జనవరి 21: యెమెన్ అధ్యక్షుడిని తిరుగుబాటుదారులు బందీగా పట్టుకున్నారు. 
  • 2015, జనవరి 22: సౌదీ రాజు అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ మరణించాడు. 
  • 2015, జనవరి 22: ఇండో-అమెరికన్ రచయిత్రి ఝంపా లహరి రచించిన "ది లోలాండ్" పుస్తకానికి 50వేల డాలర్ల సాహిత్య పురస్కారం లభించింది.
  • 2015, జనవరి 26: విశ్వసుందరి-2014గా అమెరికాకు చెందిన పౌలినా వెగా ఎంపికైంది.
  • 2015, జనవరి 30: పాకిస్తాన్‌లోని షికార్‌పూర్ జిల్లాలో బాంబు పేలి 50 మంది మరణించారు. 
 ఫిబ్రవరి 2015:
  • 2015, ఫిబ్రవరి 1: కుటుంబమాత్ర పితామహుడిగా పేరుపొందిన కార్ల్ జెరాస్సీ మరణించాడు. 
  • 2015, ఫిబ్రవరి 4: తైవాన్‌లో ట్రాన్స్‌ఏషియా విమానం కిలంగ్ నదిలో పడి 26మంది మరణించారు. 
  • 2015, ఫిబ్రవరి 6: ప్రపంచంలోనే అతిపెద్ద స్థూలకాయుడిగా పేరుపొందిన 444 కిలోల కీత్ మార్టిన్ (బ్రిటన్) మరణించాడు. 
  • 2015, ఫిబ్రవరి 12: తూర్పు ఉక్రేయిన్ సంక్షోభంపై శాంతి ఒప్పందం కుదిరింది. 
  • 2015, ఫిబ్రవరి 16: లిబియాలో 21 మంది క్రిస్టియన్లను ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు హతమార్చారు. 
  • 2015, ఫిబ్రవరి 22: బంగ్లాదేశ్‌లో పడవ మునిగి 60+ మరణించారు. 
  • 2015, ఫిబ్రవరి 23: ఆస్కార్ అవార్డులు=>ఉత్తమ చిత్రంగా బర్డ్ మ్యాన్, ఉత్తమ నటిగా జులియన్నే మూర్, ఉత్తమ నటుడిగా ఎడ్డి రెడ్‌మయిన్, ఉత్తమ దర్శకుడిగా అలెజాండ్రో ఇనర్రితు, ఉత్తమ విదేశీ చిత్రంగా ఇదా. 
 మార్చి 2015:
  • 2015, మార్చి 9: అమెరికాలో భారత రాయబారిగా అరుణ్ సింగ్ నియమితులైనారు. 
  • 2015, మార్చి 20: ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి మాల్కంఫ్రేజర్ మరణించారు.
  • 2015, మార్చి 21: సిరియా దాడులలో 45 మంది మరణించారు. 
  • 2015, మార్చి 24: ఫ్రాన్స్‌లో ఎయిర్ బస్-320 విమానం కూలి 144 మంది మరణించారు. 
  • 2015, మార్చి 23: సింగపూర్ జాతిపిత, తొలి ప్రధాని లీ క్వాన్ యూ మరణించారు.
  • 2015, మార్చి 29: యెమెన్‌లో సంక్షోభం తలెత్తింది. హంతి తిరుగుబాటు దారులను లక్ష్యంగా చేసుకొని సౌదీ అరేబియా వైమానిక దాడులు ప్రారంభించింది.  
 ఏప్రిల్ 2015:
  • 2015, ఏప్రిల్ 2: ప్రపంచంలో అత్యంత వృద్ధురాలైన జపాన్‌కు చెందిన మిసాకో ఒకావా (117 సం.లు) మరణించింది. 
  • 2015, ఏప్రిల్ 2: కెన్యాలో గరిస్సా విశ్వవిద్యాలయంపై అల్‌షబాబ్ ఉగ్రవాదులు దాడిచేసి 150 మందిని హతమార్చారు. 
  • 2015, ఏప్రిల్ 2: రష్యాలో ట్రాలర్ మునిగి 54+ మంది మరణించారు. 
  • 2015, ఏప్రిల్ 3: సౌరకుటుంబంలో ఒక ఉపగ్రహానికి విశ్వనాథన్ ఆనంద్ పేరుపెట్టబడింది. "4538 విషీ ఆనం" ఉపగ్రహం అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య ఉంది. 
  • 2015, ఏప్రిల్ 10: ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెటర్ రిచీ బెనాడ్ మరణించాడు. 
  • 2015, ఏప్రిల్ 11: సౌరకుటుంబంలోని ఒక గ్రహశకలానికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ పేరుపెట్టబడింది. 
  • 2015, ఏప్రిల్ 14: లిబియా నుంచి ఇటలీ వెళ్తున్న పడవ ముక్కలై 400+ ప్రయాణీకులు మరణించారు.
  • 2015, ఏప్రిల్ 19: మద్యధరా సముద్రంలో పడవ మునిగి 700 మంది మరణించారు. 
  • 2015, ఏప్రిల్ 21: పాకిస్తాన్ యొక్క అత్యున్నత ఆవార్డు "నిషాన్-ఇ-పాకిస్తాన్"ను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కు ప్రధానం చేశారు. 
  • 2015, ఏప్రిల్ 22: భారత మూలాలున్న వ్యక్తి పళని కుమనన్‌కు పులిట్జర్ బహుమతి లభించింది. 
  • 2015, ఏప్రిల్ 22: నేపాల్ బస్సు ప్రమాదంలో 17మంది భారతీయ యాత్రికులు మరణించారు.
  • 2015, ఏప్రిల్ 25: నేపాల్‌లో భారీ భూకంపం సంభవించి 10,000కు పైగా మరణించారు. 
మే 2015:
  • 2015, మే 1: నాసాకు చెందిన అంతరిక్షనౌక బుధగ్రహాన్ని ఢీకొట్టింది. 
  • 2015, మే 8: పాకిస్తాన్‌లో హెలికాప్టర్ కూలి నార్వే, ఫిలిప్పీన్స్ రాయబారులు మరణించారు.
  • 2015, మే 8: బ్రిటన్ ఎన్నికలలో కన్జర్వేటివ్ పార్టీ ఆధిక్యం సాధించింది. మొత్తం 650 స్థానాలకుగాను 331 స్థానాలను, లేబర్ పార్టీ 232 స్థానాలను పొందింది. 
  • 2015, మే 11: బ్రిటన్ మంత్రివర్గంలో భారత సంతతికి చెందిన ప్రీతీ పతేల్‌కు కేబినెట్ హోదా లభించింది. 
  • 2015, మే 13: కరాచీలో ఉగ్రవాదుల దాడిలో 45 మంది మరణించారు. 
  • 2015, మే 13: బ్రిటన్‌లో ఈలింగ్ కౌన్సిల్ మేయరుగా భారత సంతతికి చెందిన మహిళ ఎన్నికైంది. 
  • 2015, మే 14: నేషనల్ జియోగ్రఫిక్-బి పోటీలో ఇండో-అమెరిక విద్యార్థి కరణ్ మీనన్ విజేతగా నిలిచాడు.
  • 2015, మే 15: ప్రముఖ గాయకుడు, గిటారిస్ట్ బీబీ కింగ్ మరణం. 
  • 2015, మే 16: ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీకి ఆ దేశ న్యాయస్థానం మరణశిక్ష విధించింది.
  • 2015, మే 19: అతి తక్కువ సమయంలో 10లక్షల మంది అభిమానులను సంపాదించి బరాక్ ఓమాబా రికార్డు సృష్టించారు. 
  • 2015, మే 24: అంతర్జాతీయ వేదిక బ్యూరో ఆఫ్ రీసైక్లింగ్ సంస్థ అధ్యక్షుడిగా రంజిత్ సింగ్ భక్షి ఎన్నికయ్యారు. 
  • 2015, మే 24: మూడు నిమిషాల్లో 105 సెల్ఫీలు తీసి హాలీవుడ్ నటుడు డ్వేన్ జేమ్స్ గిన్నిస్ రికార్డు సృష్టించాడు. 
  • 2015, మే 24: గణిత మరియు ఆర్థికవేత్త జాన్ నాష్ మరణం.
  • 2015, మే 26: తొలి ఏక పరమాణువు డయోడ్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు.
  • 2015, మే 28: ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటి ప్రెస్‌చే ఈ ఏడాది పిల్లల పదంగా # (హ్యాష్ త్యాగ్) ఎంపికైంది. 
జూన్ 2015:
  • 2015, జూన్ 1: పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి బస్టాండులోకి వెళ్ళడంతో నైజీరియాలో 69మంది సజీవ దహనం అయ్యారు. 
  • 2015, జూన్ 2: ప్రపంచంలో అత్యంత గొప్ప చారిత్రక నిర్మాణాల్లో పెరూలోని మాచుపిచ్చు తొలిస్థానం దక్కించుకుంది.
  • 2015, జూన్ 2: చైనాలో జాన్‌ట్సీ నదిలో పడవ బోల్టాపడి 450+ మంది మరణించారు. 
  • 2015, జూన్ 4: మారిషస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా అమీనా గురిబ్ ఫకిమ్‌ నియమితులైనారు. 
  • 2015, జూన్ 11:ప్రముఖ బ్రిటీష్ నటుడు రోన్‌మూడి మరణం. 
  • 2015, జూన్ 28: ప్రపంచ 16వ సంస్కృత సదస్సు బాంకాక్‌లో ప్రారంభమైంది.
  • 2015, జూన్ 30: ఇండోనేషియాలో మిలటరీ విమానం కూలి 45 మంది మరణించారు. 
జూలై 2015:
  • 2015, జూలై 2: అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన వ్యోమగామిగా రష్యాకు చెందిన గెన్నడీ పడాల్కా రికార్డు నెలకొల్పాడు. 
  • 2015, జూలై 2: ఇండో-అమెరికన్-- ఆర్.పాల్‌సింగ్‌కు ప్రపంచ వ్యవసాయ పురస్కారం ప్రకటించబడింది.
  • 2015, జూలై 3: తానా 20వ మహాసభలు డెట్రాయిట్‌లో ప్రారంభమయ్యాయి.
  • 2015, జూలై 3: ఫిలిప్పీన్స్ పడవ ప్రమాదంలో 41+ మరణించారు.
  • 2015, జూలై 3: గ్వాటెమాలలో ఫ్యూగో అగ్నిపర్వతం బద్దలైంది. 
  • 2015, జూలై 5: గ్రీసులో యూరో షరతులను ఒప్పుకోవాలా వద్దా అనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.
  • 2015, జూలై 6: గ్రీసు ప్రజాభిప్రాయ సేకరణలో "ఎస్" (యూరో షరతులను ఒప్పుకోవాలి)కు మెజారిటి లభించింది. 
  • 2015, జూలై 6: గ్రీసు ప్రధానమంత్రి అలెక్సిస్ సిప్రాస్ రాజీనామా చేశారు.
  • 2015, జూలై 6: కాలిఫోర్నియాలో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీయార్ విగ్రహం ఆవిష్కరింబడింది.
  • 2015, జూలై 6: నైజీరియాలో ఉగ్రవాదుల బాంబుపేలుళ్ళలో 51మంది మరణించారు. 
  • 2015, జూలై 7: ప్రపంచంలో అత్యంతవృద్ధిడిగా పేరుపొందిన జపాన్‌కు చెందిన శాకరి మొమొయి మరణించాడు. 
  • 2015, జూలై 14: ప్లూటోకు చేరువగా వెళ్ళిన అంతరిక్షనౌక న్యూ హోరైజాన్స్. 
  • 2015, జూలై 23: భౌతిక శాస్త్రవేత్త-- పీటర్ హిగ్స్‌కు రాయల్ సొసైటి కొప్లే పతకం ప్రకటించింది.
  • 2015, జూలై 23: ఫార్చ్యున్-500లో వాల్‌మార్ట్ కంపెని తొలి స్థానం పొందింది. 
ఆగస్టు 2015:
  • 2015, ఆగస్టు 5: ప్రపంచంలో అత్యధికంగా ఆర్జించే నటులలో రాబర్ట్ డౌనీ జూనియర్ ప్రథమ స్థానంలో, జాకీ చాన్ రెండో స్థానంలో నిలిచారు.  
  • 2015, ఆగస్టు 6: సూయజ్ కాలువకు సమాంతరంగా మరో కొత్త కాలువ ప్రారంభించబడింది.
  • 2015, ఆగస్టు 12: ఫోర్బ్స్ సాంకేతిక దిగ్గజాల జాబితాలో బిల్ గేట్స్ కు అగ్రస్థానం లభించింది. భారత్ తరఫున అజీం ప్రేంజీకి ప్రథమస్థానం. 
  • 2015, ఆగస్టు 17: థాయిలాండ్ రాజధాని బాంకాక్‌లోని బ్రహ్మ దేవాలయంలో పేలుడు సంభవించి 27 మంది మరణించారు.
  • 2015, ఆగస్టు 20: దేశంలో ఆర్థిక సంక్షోభం వల్ల గ్రీసు ప్రధానమంత్రి అలెక్సిస్ సిప్రాస్ రాజీనామా చేశారు.
  • 2015, ఆగస్టు 20: అత్యంత సంపన్నుడైన యువ కుబేరుడిగా మార్క్ జుకల్‌బర్గ్ ప్రథమస్థానంలో నిలిచాడు.
  • 2015, ఆగస్టు 21: శ్రీలంక ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే పదవిచేపట్టారు. 
  • 2015, ఆగస్టు 25: సిరియాలో యునెస్కో గుర్తింపు పొందిన ప్రాచీన ఆలయాన్ని ఐఎస్ తీవ్రవాదులు కూల్చివేశారు. 
సెప్టెంబరు 2015:
  • 2015, సెప్టెంబరు 4: ప్రపంచంలోనే అతి పొట్టివాడిగా పేరుపొందిన చంద్ర బహదూర్ డాంగీ (నేపాల్) మరణం.
  • 2015, సెప్టెంబరు 12: మక్కాలో క్రేను ప్రమాదంలో 87 మంది మరణించారు.
  • 2015, సెప్టెంబరు 20: నేపాల్‌లో కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. (37 విభాగాలు, 304 ప్రకరణలు, 7 పట్టీకలు)
  • 2015, సెప్టెంబరు 21: దక్షిణాఫ్రికాలోని రస్టెన్‌బర్గ్ నగరంలో మహాత్మాగాంధీ విగ్రహం ఆవిష్కరించారు.
  • 2015, సెప్టెంబరు 24: మినా (సౌదీ అరేబియా)లో హజ్ యాత్రలో తొక్కిసలాట జరిగి 700+ మరణించారు. 
అక్టోబరు 2015:
  • 2015, అక్టోబరు 5: 2015 సంవత్సరపు వైద్యశాస్త్ర నోబెల్ బహుమతులు ఇలియం క్యాంబెల్, సతోహి ఒమురా, యుయు లకు ప్రకటించబడింది. 
  • 2015, అక్టోబరు 5: ట్విట్టర్ శాశ్వత CEOగా జాక్ డోర్పే నియమితులైనారు. 
  • 2015, అక్టోబరు 6: 2015 సంవత్సరపు భౌతికశాస్త్ర నోబెల్ బహుమతి ఆర్థర్ మెక్ డొనాల్డ్,తకాకి కజితలకు ప్రకటించబడింది.
  • 2015, అక్టోబరు 8: 2015 సంవత్సరపు సాహిత్య నోబెల్ బహుమతి స్వెత్లానా అలెక్సివిచ్ కు ప్రకటించబడింది.
ఇవి కూడా చూడండి: అంతర్జాతీయ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 200820092010, 2011, 2012, 2013, 2014,

Telugu News, తెలుగు వార్తలు,

4 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. వార్తలలో వచ్చిన శాస్త్ర-సాంకేతిక రంగాలకు సంబంధించిన ప్రశ్నలు ఆయా పోస్టులలో చూడవచ్చు.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. సమయం సరిపోనందున నవంబరు నుంచి సంక్షిప్త వార్తలు ఇక్కడ చేర్చడం లేదండి.

      తొలగించండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక